Cm attending for racha banda program in vizag

CM Attending for Racha Banda Program in Vizag, Racha Banda Program in Vizag, cm kiran kumar reddy, minister balraju, tdp chief chandrababu naidu, ap bifurcation, cm vs babu, congress vs tdp

CM Attending for Racha Banda Program in Vizag

సీఎం సభకు మంత్రి బాలరాజు గైర్హాజరు-చంద్రబాబే కారణం

Posted: 11/15/2013 08:22 PM IST
Cm attending for racha banda program in vizag

విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం రచ్చబండ కార్యక్రమం ఉందని సమాచారం అందలేదని, సీఎం తనతో చర్చించలేదని, సీఎం కార్యాలయం అధికారులతో చెప్పించే దుస్థితి ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. ఇదే విషయంపై మంత్రి కొండ్రు మురళి స్పందించారు. సీఎం పర్యటనపై సమాచార శాఖ మంత్రి బాలరాజుకు సమాచారం అందించకపోవడం సరికాదన్నారు. సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని కొండ్రు మురళి చెప్పారు.

 

చంద్రబాబే కారణం

రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడే కారణమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చి, ఇప్పుడు సమన్యాయం అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటో బాబు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. పశ్చిమగోదారి జిల్లా, పొన్నూరు మండలం, జగన్నాథపురంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కిరణ్ ప్రసంగించారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మేలు జరగాలి, అలా జరిగితేనే ప్రజలు హర్షిస్తారని ఆయన అన్నారు.

 

దురదృష్టవ శాత్తు రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, ఈ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, సమైక్యన్ని కోరుకుంటున్నారని, సిఎం కిరణ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈనెల 18వ తేదీన ఢిల్లీలో జరగనున్న సమావేశంలో వినిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అన్ని రాజకీయ పార్టీలు విభజనపై లేఖలు ఇచ్చారని, వీటిని ఆధారంగా కేంద్రం విభజన నిర్ణయాన్ని తీసుకుందని ఆయన అన్నారు. సమైక్యానికి తాను గట్టిగా కృషి చేస్తానని అన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రూ. 78.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రచ్చబండ కార్యక్రమం కోసం జిల్లాలోని పెనుగొండకు చేరుకున్న సీఎంకు ఏఎంసీ గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి కావూరి, జిల్లా మంత్రలు, పలువురు నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలికారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more