Comedian sri laxmi interview

Andhra News, AP News, tollywood, telugu movies, telugu films, movies, music, telugu serials, daily serials, amrutham comedy serial

Andhra News, AP News, tollywood, telugu movies, telugu films, movies, music, telugu serials, daily serials, amrutham comedy serial

Comedian Sri Laxmi Interview.gif

Posted: 05/22/2012 03:15 PM IST
Comedian sri laxmi interview

Comedian_Sri_Laxmi_Interview

Srilaxmiమన దగ్గర హాస్య నటులు తక్కువ. వాళ్లల్లో తనకంటూ ఒక ప్రత్యేకతనూ తన నటనకంటూ ప్రత్యేకమైన శైలిని స్రుష్టించుకున్న నటి శ్రీలక్ష్మి. నవ్వించే మ్యానరిజాలకు అమాయక పాత్రలకూ ఆమె ట్రేడ్ మార్క్. కుటుంబ భారాన్ని భుజాన్నేసుకుని వెండితెరకు వచ్చి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న ఈ హాస్యనటి మనతో పంచుకున్న మరిన్ని విషయాలు మీకోసం....

డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యాను అంటారు. కానీ హీరోయిన్ అవుదామని వెండి తెరకు వచ్చి హాస్యనటిగా స్థిరపడ్డాను. నిజం చెప్పాలంటే నటన పై నాకు ఆసక్తి ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో నటినయ్యాను. ఆ రోజుల్లో అప్పటి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో.. ఏదో ఒక పాత్రలో నటించడమే తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. అందుకు కారణం నాన్నగారి మరణం.

కుటుంబ నేపథ్యం :

నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో. నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకూ చదువుకున్నారు. ఇంటర్ ప్రైవేటుగా చదివాను. నాన్నగారు అమర్ నాథ్. సినిమా హీరో. ‘అమరదేశం’ ‘పిచ్చి పుల్లయ్య’ ‘చండీరాణి’ లాంటి సినమాల్లో నటించారు. అమ్మ సరళా దేవి. మేం మొత్తం ఆరుగురం. ఇద్దరు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలం. నేను రెండో అమ్మాయిని. నా తరువాత తమ్ముడు రాజేష్. నాన్న వాళ్ళది రాజమండ్రి. బాల్యమంతా ఆనందంగానే గడిచింది. తరువాత టీనేజ్. ఆ వయస్సులో చాలామంది కలలుకన్నట్టే నేను హీరోయిన్ అవుతామనుకున్నాను. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ‘శుభోదయం’ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికయ్యాను. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘నీకు హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని విశ్వనాథ్ గారు కూడా ప్రోత్సహించారు.  అందులో చంద్రమోహన్ గారితో నటించాల్సింది. అదే సమయంలో నాన్న గారికి కామెర్లు వచ్చాయి. హఠాత్తుగా మరణించారు. సరిగ్గా అప్పుడే సినిమా షూటింగ్ ప్రారంభం. ఆ పరిస్థితుల్లో నటించడం నావల్ల కాలేదు. అలా తొలి హీరోయిన్ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది.

నాన్న గారి మరణం తరువాత మా కుటుంబ పరిస్థితి ఏంటా అన్న ఆలోచన మొదలైంది. ఇంటి బాధ్యతను నా పైనే వేసుకున్నాను. కొన్నాళ్ళ తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. దాంతో మేమంతా చెన్నైకి వెళ్ళిపోయాం. మలయాళంలో నాలుగు సినిమాల్లో నటించాను. తమిళంలో కూడా ఓ మూడు సినిమాల్లో నటించాను. ఆ పై అనుకోకుండా తెలుగులో హాస్యనటిగా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తున్నప్పుడే బాపయ్య గారు ‘నివురు గప్పిన నిప్పు’లో ఒక హాస్య పాత్రలో నటించమని అడిగారు. అందులో నగేష్ భార్య పాత్ర నాది. అప్పటి వరకూ అలాంటి పాత్రలో నటించలేదు. కాబట్టి హాస్యం అనగానే కాస్త భయమేసింది. ఎందుకంటే కామెడీ చేయడం చాలా కష్టం. నావల్ల కాదని చెప్పాను. అప్పుడాయన అలా అనకూడదమ్మా, నటి అన్నాక అన్ని పాత్రలలో నటించాలి. నువ్వు నటించగలవు అని ధైర్యం చెప్పి ఒప్పించారు.

ఒక ప్రక్క హీరోయిన్ గా రాణిస్తున్నప్పుడు కామెడీ పాత్రలు వస్తే ఎవ్వరూ చేయరు. అయితే అప్పుడు నా కెరీర్ గురించి ఆలోచించేంత అవకాశం లేదు. నేను హీరోయిన్ పాత్రలైతేనే చేస్తాను. అని భీష్మించుకుని కూర్చునే పరిస్థితి కాదు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేశాను. అలా హస్యనటిగా మారాను.  మరో పక్క... మా తమ్ముడు రాజేష్ కి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. రెండు జళ్ళ సీత, మల్లెమొగ్గలు, ఆనంద భైరవి లాంటి చిత్రాల్లో నటించాడు. దాంతో మా కుటుంబం స్థిరపడింది.

Sri-Laxmiనా నటనా జీవితంలో మైలురాయి అని చెప్పుకోదగ్గ చిత్రం మాత్రం... శ్రీవారికి ప్రేమలేఖ అనే చెప్పాలి. అందులో ‘ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి సినిమా కథలు టైటిల్ కార్డుతో మొదలు పెట్టి శుభం కార్డు వరకూ ఏకబిగిన... పూసగుచ్చినట్లు అవతలివాడు వింటున్నా వినకున్నా కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నా... వాయించేసే విచిత్రమైన పాత్రలో నటించాను. దాంతో శ్రీలక్ష్మి పేరు తెలుగులో ప్రజలందరికీ సుపరిచితమైంది. ఆ ఘనత మా గురువుగారు జంధ్యాల గారికే దక్కుతుంది.  ఆయన సినిమాలో నాకంటూ ఓ ప్రత్యేకమైన పాత్రనూ ప్రతి పాత్రకీ ప్రత్యేకమైన మ్యానరిజాన్ని స్రుష్టించేవారు. అయితే, వాటన్నింటిలో అమాకత్వం మాత్రం కామన్ గా ఉండేది. బహుశా ఆ అమాయకత్వం వల్లనేమో ఆ పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు.

1990 నుండి దాదాపు ఐదేళ్ళ పాటు నాకు క్షణం తీరిక లేకుండా షూటింగులు ఉండేవి. ఇప్పటికీ దాదాపు 500 చిత్రాల్లో నటించాను. రెండు నంది అవార్డులతోపాటు, 13 సంవత్సరాలు వరుసగా కళాసాగర్ పురస్కారాలను దక్కించుకున్నాను. నా పనిని నేను నిబద్దతో చేయడం వల్ల దక్కిన గుర్తింపు అది. అవార్డులన్నీ ఒకెత్తు... దక్షిణాది బాషలలో నటించి ప్రేక్షకుల అభిమానం పొందడం మరొకెత్తు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేసి పలకరిస్తుంటారు.

నేను పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమించాను. ఆ శ్రమలో చాలా విషయాలు నేర్చుకున్నాను. బలహీనత అనేది మనసులోకి వచ్చిన క్షణమే దాని వెనకాలే అపజయమూ వస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మానసిక స్థైరాన్ని కోల్పోకూడదు. ఆ స్థితికి చేరుకున్న వారు ఎవరైనా, ఎందులోనైనా విజయం సాధిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian freedom fighter kamala nehru
Pls trust founder jyothi poojari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles