అలుపెరుగని ధైర్యసాహసాలతో అక్షరమే ఆయుధంగా చేసుకొని సామాజిక, రాజకీయ అంశాలపై అనేక వ్యాసాలు రాసి పలువురి దృష్టిని ఆకర్షించి దేశంలో పాపులారిటిని సంపాదించిన ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్. ఈమె రాసిన వ్యాసాలతో అంతర్జాతీయ ప్రసిద్ధి చెంది అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
ఈమె రచయిత్రి మాత్రమే కాదు ఉద్యమకారిణి. 1997లో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచనకు ఈమె బుకర్ ప్రైజ్ అందుకున్నారు. 2002లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి అందుకున్నారు. బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. వీటితో పాటు రెండు సినిమాలకు స్క్రీన్‌ప్లేలతో వ్యాసాలు, కథనాలు రాసి పలువురిని ఆకట్టుకున్నాయి. తరచుగా ఏదోక వివాదాలతో వార్తల్లో కనిపిస్తుంటారు.మేఘాలయలోని షిల్లాంగ్‌లో జన్మించారు అరుంధతీ. టీ ఎస్టేట్ యజమాని రంజిత్ రాయ్, మలయాళీ సిరియన్ క్రిస్టియన్ మహిళల హక్కుల కోసం పోరాడిన మేరీ రాయ్‌లకు ఆమె పుట్టారు. బాల్యం, విద్య కేరళలోనే సాగింది. ఉన్నత విద్య ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఆమె ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తిచేశారు. అక్కడే ఆమెకు తన మొదటి భర్త ఆర్కిటెక్ట్ గెరార్డ్ కున్హాతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. రెండవ భర్త ఫిల్మ్ మేకర్ ప్రదీప్ కృష్ణన్‌ను 1984లో కలుసుకున్నారు.
ప్రదీప్ రూపొందించిన సినిమా మాస్సీ సాహిబ్‌లో గ్రామీణ యువతిగా నటించారు. రాయ్ జీవనోపాధి కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో ‘ఏరోబిక్స్ క్లాసెస్’ నడుపుతూ ఢిల్లీలో జీవిస్తున్నారు. చివరికి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవల సక్సెస్‌తో ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ‘నర్మదా బచావో ’ ఆందోళనను సమర్ధిస్తూ ఈమె రాసిన ది గ్రేటర్ కామన్ గుడ్ రచన వివాదాస్పదంగా మారింది. తొలినాళ్లలో రచయితగానే కాకుండా స్క్రీన్‌పై కూడా రాణించారు. పలు సీరియల్స్‌కు, సినిమాలకు స్క్రీన్‌ప్లేలు రాసేవారు. 1989లో ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్, 1992లో ఎలక్ట్రిక్ మూన్ వంటి చిత్రాలకు ఆమె స్క్రీన్‌ప్లే రాశారు. భర్త దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఇన్‌విచ్ సినిమాలో ఆమె నటించారు కూడా. బందిపోటు రాణి పూలన్‌దేవి జీవితంపై శేఖర్ కపూర్ రూపొందించిన సినిమా బండిట్ క్వీన్ చిత్రాన్ని విమర్శించడం ద్వారా 1984లో అరుంధతీరాయ్ అందరి దృష్టిని ఆకర్షించారు.
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా...
అరుంధతీరాయ్ పలు కార్యక్రమాలు, ఊరేగింపుల్లో పాల్గొనే వారు. నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మేధాపాట్కర్‌కు మద్దతుగా నిలిచారు.లక్షలాది మంది ప్రజలను నిర్వాసితులను చేసే ఈ డ్యామ్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇతర ఉపయోగాలు ఏమీ లేవని ఆమె స్పష్టం చేశారు.
బుకర్ ప్రైజ్ మొత్తంతో పాటు రాయల్టీ డబ్బు అంతటినీ ఆమె నర్మదా బచావ్ ఆందోళనకు విరాళంగా అందజేయడం విశేషం. అరుంధతీరాయ్ పలు సందర్భాల్లో మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం ఆయుధాలతో మావోయిస్టులపై చేస్తున్న దాడులను ఆమె దేశంలోని పేదలపై యుద్ధంగా అభివర్ణించారు. మావోయిస్టులు దేశభక్తిగల వారని వారు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోరాడుతుండగా ప్రభుత్వం వారిపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఆమెపై మావోయిస్టు సానుభూతిపరురాలిగా ముద్రపడింది.
అవార్డులు
1997లో బుకర్ ప్రైజు రాసిన నవల ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్‌కు లభించింది. ఈ అవార్డుతో 30,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి ఆమెకు దక్కింది. 2002లో లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, 2004, మేలో సిడ్నీ శాంతి బహుమతి లభించింది. 2006లో సాహిత్య అకాడమీ అవార్డు. అయితే భారత ప్రభుత్వం అమెరికా అడుగుజాడలలో నడుస్తోందని ఈ అవార్డు స్వీకరించడానికి నిరాకరించింది.
వివాదాస్పద వ్యాఖ్యలు
2008లో జరిగిన ముంబయ్ దాడులను ఆమె కాశ్మీర్ అంశం, రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించినప్పుడు ఆమె 1998లో ది ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ పేరిట కేంద్ర ప్రభుత్వ అణు విధానాన్ని దుయ్యబట్టారు. వీటితోపాటు ఇతర దేశాల్లో విషయాల పట్ల కూడా విమర్శలు గుప్పించేవారు. అఫ్ఘనిస్తాన్‌పై అమెరికా దాడులను ది గార్డియన్ పత్రికలో ఆమె తీవ్రంగా ఖండించారు. అమెరికా, బ్రిటన్ దేశాలు శాంతి పేరుతో ప్రపంచాధిపత్యాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. 2008లో అగస్టులో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ నుంచి కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కల్పించాలని జరగుతున్న ఉద్యమంలో రాయ్ మద్దతుగా నిలిచారు. దీంతో దేశంలోని పలు పార్టీలు అమెను విమర్శిచాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more