Telugu movie news they life conquered

angelina jolie, breast cancer, film star angelina jolie, actress lisa ray, lisa ray back in cancer treatment, conquering cancer in 2010, actor mamta mohandas, undergoing cancer, manisha koirala, fighting cancer,bollywood actress manisha koirala, varian cancer, gauthami, cancer, actress gauthami, kamal talks about gauthami, cancer

they life Conquered, cancer

వీరు జీవితాన్నే 'జయించారు'.

Posted: 05/17/2013 01:30 PM IST
Telugu movie news they life conquered

మొన్న వార్తలు విన్న వారికి , కొంతమందికైతే ఈ వార్త ముందు షాక్ కి గురి చేసినా , తరువాత ఊరటనిచ్చింది . భాషా బేధం లేకుండా , యావత్ ప్రపంచం అభిమానించే హీరోయిన్, ఎంజలీనా జాలీ , క్యాన్సర్ తో పోరాడి గెలవటం . చాల మంది ఇంగ్లీషు వారు కాక , ఇతర భాషా అభిమానులకు ఈ వార్త ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది . స్టార్ హీరోయిన్ హోదా , తనతో సమానంగా పేరు ఉన్న హాలీవుడ్ హీరో , బ్ర్యాడ్ పిట్ తో ప్రేమ బంధం , గంపెడు పిల్లలు , అయినా ఇంకా పిల్లల్ని కనడం కొనసాగిస్తాను అంటున్న ఎంజలీన ధీమా , అన్నిటికీ మించి లెక్కలేనంత డబ్బు , పట్టలేని హోదా , ఈ క్యాన్సర్ వ్యాధి ఎంజలీన జోలికే ఎందుకు వెళ్ళాలి ? ఇటువంటి మహమ్మారి తో పోరాడి గెలిచిందంటే , ఈ హీరోయిన్ ధైర్యానికి , ఆత్మా స్థైర్యానికి జోహార్లు ...

ఈ సందర్భంగా , రీల్ లైఫ్ లో కష్టాలు ఉన్నట్టుగా సినిమాల్లో నటించడం మాట అటుంచి , రియల్ లైఫ్ లో క్యాన్సర్ వంటి మహమ్మారి తో పోరాడి గెలిచిన కొంతమంది హీరోయిన్ల ధైర్యం మాటలలో చెప్పుకుందాం ;

మహేష్ బాబు కౌ బాయ్ గెట్ అప్ లో కనిపించిన 'టక్కరి దొంగ' చూసిన ప్రతీ ఒక్కరికి , ఈ చిత్రం లో సెకెండ్ హీరోయిన్ గా నటించిన బిపాషా బాసు కన్నా , మెయిన్ హీరోయిన్ , లీసా రే అంద చందాలు విపరీతంగా నచ్చాయి . తరువాత హిందీ సినిమాల్లో కనిపించిందీ సూపర్ మాడల్ . ఆపై కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది . అయితే , అనుకోకుండా క్యాన్సర్ బారిన పడింది లీసా ... దాదాపు ఒక 3 సంవత్సరాలు ఈ వ్యాధి తో పోరాడింది . తనకు తానూ సద్ది చెప్పుకుంటూ , ట్రీట్మెంట్ తీసుకుంటూ , ఈ వ్యాధి తన బాహ్య సౌందర్యం పైన ఎంతటి ఊహించలేని ప్రభావం చూపిస్తున్నా , అంతర్లీనంగా తన ఆత్మా స్థైర్యాన్ని మాత్రం వదలలేదు లీసా . ఫలితంగా క్యాన్సర్ ని తన నుండి తరిమి కొట్టి , ఒక హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ను ప్రేమించి , గత యాడాది వివాహం చేసుకుంది లీసా ...

'రాఖీ రాఖీ' అంటూ కుర్ర కారుని తన స్వరం తో కవ్వించినా , 'యమ దొంగ ' చిత్రం లో వయ్యారాలు పోతూ 'అబ్బాయా' అంటూ యన్ . టీ . ఆర్. ను బుట్టలో వేసుకున్నా , ఇది కేవలం మమతా మోహన్దాస్ కు మాత్రమె సాధ్యపడింది . తెలుగు , తమిళం , మలయాళం లో ఎన్నో చిత్రాలలో నటించి , తన గాన మాధుర్యాన్ని పంచిన ఈ తలెంటెడ్ తార కూడా , క్యాన్సర్ బారిన పడక తప్పలేదు . కరియర్ పుంజుకుంటున్న సమయం లోనే ఈ వ్యాధి వల్ల కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవలసి వచ్చింది మమత . తరువాత , నమ్మకం తో , సరి అయిన ట్రీట్మెంట్ తో ఈ వ్యాధి ని జయించి , పెళ్లి కూడా చేసుకున్న మమత , ఇప్పుడు మనస్పర్ధలతో భాగస్వామి తో విడిపోయి , మళ్ళీ సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నం చేస్తోంది .

manisha

90 లలో హిందీ చిత్ర సీమ లో అడుగుపెట్టి , భాసాబెధం లేకుండా సినిమాలు చేసి , అన్ని భాషలలో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటి , మనీషా కొయిరాల . హీరోయిన్ గా సాధించవలసిన విజయాలు సాధించిన తరువాత , తన చిన్ననాటి స్నేహితునితో , పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మనీష , సగటు మహిళగా అత్తవారింట వేధింపులు ఎడురుకోక తప్పలేదు . ఈ అక్కరలేని బంధం నుండి బయట పడ్డాను కదా అనుకుంటున్న సమయం లో క్యాన్సర్ వ్యాధి తనను చుట్టుముట్టిందని తెలుసుకున్న మనీష , ధైర్యం కోల్పోకుండా సమయానికి స్పందించి , వైద్యం , ధైర్యం రెండూ సరిగ్గా తనకు అందేలా చూసుకుని , ప్రస్తుతానికి క్యాన్సర్ ను తన జీవితం నుండే తరిమికోట్టింది .

gouthami

ఇక దక్షిణాది నటి , గౌతమి వైవాహిక జీవితం లో సమస్యలని ఎదురుకోవడం , తన కూతురిని పెంచుకుంటూ , 'తోటి నటుల స్నేహం , సహకారం తో ' క్యాన్సర్ వ్యాధి నుండి ఎలా విముక్తి పొందిందో , మనందరికీ తెలిసిందే ...

'రంగుల ప్రపంచం లో అందరు సున్నిత మనస్కులు , కష్టాలు తట్టుకోలేరు ' అనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ మహిళలందరి జీవితాలే ఒక స్పూర్తి .

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles