Biocon md kiran mazumdar shaw

Kiran Mazumdar Shaw, Biocon MD, chairman, Iindia largest company

The latest from Kiran Mazumdar Shaw Chairman and Managing Director of Biocon, India largest Biotechnology company.

పరాజయాలకు లొంగని మజుందార్ షా

Posted: 10/22/2013 05:30 PM IST
Biocon md kiran mazumdar shaw

పది వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన కంపెనీ లక్షల కోట్ల వ్యాపారం చేయటమంటే మాటలు కాదు. ఆ కంపెనీని నడిపించేందుకు పట్టుదల, తెగువలతో పాటుగా దార్శనికత కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ పరిపుష్ఠంగా ఉన్న మహిళ కిరణ్ మజుందార్ షా. ఆమె స్థాపించిన బయోకాన్ కంపెనీ- మన దేశంలో బయోఫార్మసీ రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లింది. అయితే ఈ విజయాల వెనక చాలా పరాజయాలు కూడా ఉన్నాయి

పరాజయం జీవితంలో ఆఖరి మెట్టు కాదు. కుంగిపోయి నిరాశలో కూరుకుపోవటమే ఆఖరి మెట్టు.నిరుద్యోగి అయిన ఒక బ్రూమాస్టర్ కూతురుకి- తాము పెట్టాలనుకున్న వ్యాపారానికి మూలధనం సంపాదించటం చాలా కష్టమైన పని. అయితే కిరణ్ మజుందార్ షా అందుకు పూనుకుంది. ప్రతి అడుగులోను ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు తెలుసు.

మజుందార్ షా చేయాలనుకున్న వ్యాపారం మన దేశంలో కొత్తది. అప్పటి దాకా ఎవరూ అలాంటి వ్యాపారం చేయాలని ప్రయత్నించలేదు. మహిళ కావటం, పెద్ద కుటుంబం నుంచి రాకపోవటం కూడా ఆమెకు ప్రతికూలాంశాలే. 25 ఏళ్ల కిరణ్‌కు- తన వ్యాపారానికి పెట్టుబడి కోసం బ్యాంకులకు వెళ్లటం, వారిని ఒప్పించటం దాదాపు అసాధ్యమయింది. ప్రతి బ్యాంకు పూచీకత్తు కావాలనేది. పూచీకత్తుకు కిరణ్ పూర్తి వ్యతిరేకి. మరో మార్గం లేక కిరణ్ తన వద్ద నున్న పదివేల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలుపెట్టింది. (అప్పుడు పదివేలంటే ఇప్పుడు నాలుగులక్షలు!). "నన్ను ఓటమిపాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. నాకు ఎవరూ ఆర్థిక సాయం చేయలేదు. నా దగ్గర ఉద్యోగం చేయటానికి నైపుణ్యం కలిగిన వారు రాలేదు. మొదటి 15 ఏళ్లు ఓటమి కోరల్లో చిక్కుకోకుండా తప్పించుకోవటానికే సరిపోయింది..'' అంటారు కిరణ్. 1978లో బయోకాన్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. దానిలో ఐర్లాండ్‌కు చెందిన లిస్లి అచిన్‌క్లాస్ అనే తొలితరం వాణిజ్యవేత్త పెట్టుబడి పెట్టాడు. కాగితం పరిశ్రమలోను, ఆల్కహాల్ పరిశ్రమలోను అవసరమైన ఎంజైమ్‌లను బయోకాన్‌లో తయారుచేసేవారు. కంపెనీ నెమ్మదిగా ఎదగటం మొదలుపెట్టింది. కాని కిరణ్‌కు అడుగడుగునా అనేక ప్రతిబంధకాలు ఎదురయ్యాయి.

ఒక మహిళ ప్రారంభించిన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకొచ్చేవారు కారు. ఒక మహిళ దగ్గర పనిచేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు కారు. అయినా కిరణ్ తన పట్టువీడలేదు. పెట్టిన పదేళ్లకు కంపెనీకి లాభాలు రావటం మొదలుపెట్టాయి. అచిన్‌క్లాస్ తన వాటాను యూనీలివర్ అనే బహుళ జాతి కంపెనీకి అమ్మేశాడు. "మనం ఎందుకు ఓడిపోతున్నామో ముందర గమనించాలి. చాలా మందిలో వ్యక్తిగత విశ్వసనీయత ఉండదు. విశ్వసనీయత ఉంటేనే ప్రజలకు మనమంటే నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు పరాజయాన్ని పారద్రోలవచ్చు..'' అంటారు కిరణ్. బయోకాన్ కంపెనీ అభివృద్ధికి కిరణ్ విశ్వసనీయత ఒక ప్రధానమైన కారణం. కిరణ్‌కు తన శక్తి తెలిసింది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సిన సమయం ఆసన్నమైందని భావించింది.

తర్వాత ఎంజైమ్‌లను తయారుచేయటం తగ్గించి బయోఫార్మాసుటికల్స్‌పై దృష్టి సారించింది. ఎంజైమ్‌ల వ్యాపారాన్ని అమ్మేసింది. అయినా ఆమె బయోఫార్మా వ్యాపారం అంత సులభంగా ప్రారంభం కాలేదు. "ఒక స్వదేశీ బయోటెక్నాలజీ కంపెనీని ప్రారంభించాలనేది నా ఉద్దేశం. కాని మా మొదటి బ్యాచ్ విఫలమయింది. దానికి కారణాలు వెతికాం. మందుల కోసం మేము తయారుచేసే ఎంజైమ్‌ల ప్రక్రియలో తేడా ఉందని తేలింది..'' అని కిరణ్ తన అనుభవాలను నెమరువేసుకున్నారు. తర్వాత కిరణ్ మధుమేహానికి నోటి ద్వారా తీసుకొనే ఇన్సులిన్‌ను తయారుచేయాలని ప్రయత్నించారు. కాని క్లినికల్ ట్రయిల్స్‌లో ఆ మందు సరిగ్గా పనిచేయలేదు. "ఆ మందు మీద నాకు చాలా ఆశలు ఉండేవి. కాని మందు అనుకున్నట్లు పనిచేయకపోవటం ఒక పెద్ద పరాజయం'' అంటారు కిరణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles