Sheila dixit special record story

sheila dixit special record story, Sheila Dixit from Congress, Delhi chief minister Sheila Dikshit, Chief Minister Shiela Dikshit

sheila dixit special record story, Sheila Dixit from Congress, Delhi chief minister Sheila Dikshit

రికార్డు సాధించిన షీలాదీక్షిత్

Posted: 11/25/2013 02:49 PM IST
Sheila dixit special record story

మహిళలు రాజకీయాల్లో రావడం అంటే అషామాషీ విషయం కాదు. భర్త, తండ్రి, లేక ఇతర బంధుత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారు. అయితే తరువాతి కాలంలో సత్తాను చాటడంలో విఫలమయిన వారే ఎక్కువ. కానీ అంది వచ్చిన అవకాశాన్ని ‘చే’జారిపోకుండా తమేంటో నిరూపించుకున్న వారు కొందరు ఉన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన మహిళలు ఉన్నారు కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరుసగా దాదాపు 15 సంవత్సరాలు సేవలు అందించిన వారు ఎవరూ లేరు. ఆ రికార్డు ఒక్క షీలాదీక్షిత్‌కు మాత్రమే చెందుతుంది. విచిత్రం ఏమిటంటే ఆమెను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది ఓ జాతీయ పార్టీ. సొంత పార్టీ నుంచి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి కావడంలో విశేషం లేదు. వీరికి ప్రజల ఆధరాభిమానాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అలాంటి నేతల్లో ఢిల్లీ ఆపధర్మ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ఒకరు. నాల్గోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం కృషి చేస్తున్నారు

కానీ కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీ నుంచి వరుసగా ఇన్ని సంవత్సరాలు సిఎం పీఠంపై కూర్చోవడం షీలా పటిమకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పుడు ఢిల్లీలో ఎన్నిలు జరుగనున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలిస్తే ఈమె నాల్గోసారి సిఎం పీఠం ఎక్కుతుంది. భవిష్యత్‌ రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ కాలం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ బాధ్యతలు నిర్వహించడం కష్టమే. ఢిల్లీలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడం సాధారణమైన విషయమేమీ కాదు. అక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో ఓటర్లను మభ్యపెట్టడం కూడా చాలా తక్కువ. అన్ని ఆలోచించి ఓటు వేసే వారి శాతం ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో అత్యంత అనుభవం, మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించకున్న రాజకీయ చతురత షీలా దీక్షిత్‌ కలిసివచ్చే అంశాలు కాగా, ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాచారాలు, కుంభకోణాలు వెంటాడుతున్నాయి.

 

పంజాబ్‌లోని కపుర్తల జిల్లాలో జన్మించిన దీక్షిత్‌ ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేమీ కాదు. నాన్నది ఢిల్లీ. అమ్మది పంజబ్‌. తండ్రి రక్షణదళ అధికారి. ముగ్గురక్కచెల్లెళ్ళలో షీలా దీక్షితే పెద్ద. హైస్కూలు చదువు ఢిల్లీ జీసెస్‌ అండ్‌ మేరీ స్కూల్లో; మిరిండా హౌస్‌ లో డిగ్రీ పూర్తిచేశారు. 1950లో ఢిల్లీ యూనివర్శిటీలో పీజీ చేస్తుండగా వినోద్‌ శర్మతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. షీలాదీక్షిత్‌ ది బ్రాహ్మణ కుటుంబం కాదు. ఆమె మామగారిది మాత్రం సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన వినోద్‌తో షీలా జీవితం సాఫీగా సాగిపోయింది. వారి కలల పంటలు బాబు(సందీప్‌), పాప(లతిక). వీరిలో సందీప్‌ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వినోద్‌ తండ్రి ఉమాశంకర్‌ దీక్షిత్‌ నెహ్రూ కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ కోశాధికరిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఇందిరా, రాజీవ్‌లతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది.

1984లో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రోత్సాహం మేరకు ఉత్తర్రపదేశ్‌లోని కనౌజ్‌ లోక్‌ సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తరువాత లోక్‌ సభ అంచనాల కమిటీలో సభ్యురాలయ్యారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ప్రధాని కార్యాలయ మంత్రిత్వశాఖలో సహాయమంత్రిగా పనిచేసి తన సమర్థతను రుజువు చేసుకున్నారు. 1989లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

 

1986లో ఓరోజు వినోద్‌ శర్మ కాన్పూర్‌ నుంచి న్యూఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తుండగా గుండెనిప్పితో మృతిచెందారు. ఆ సమయంలో షీలాదీక్షిత్‌ ఐక్యరాజ్యసమితి పని మీద న్యూయార్క్‌లో ఉన్నారు. వినోద్‌ లేని జీవితం ఊహించడానికి భయమేసినప్పటికి గుండెను రాయిగా చేసుకుని జీవితాన్ని సాగించారు. మామయ్య ఉమాశంకర్‌ దీక్షిత్‌, రాజీవ్‌ గాంధీ మద్దతుతో మాములు జీవితంలోకి వచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles