పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా... ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి తన బాల్యం నుంచే కవిత్వతత్వాన్ని ఆకళించుకున్నారు. బాల్యంలో వుండగానే ప్రముఖ సాహితీవేత్తలమధ్య జరిగే చర్యలనువింటూ.. చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాట్లాడటం, సలహాలు ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం వంటవన్ని నేర్చుకున్నారు. చిన్నవయస్సులోనే తన వాక్చాతుర్యంతో సాహితీవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన మహిళ! ఆనాటి సమాజంలో మహిళలకు ఇంకా మగాళ్లతో సమానమైన హక్కులు లభించని కాలంలోనే ఈమె ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఈమె తండ్రి నాయని సుబ్బరావు కూడా ప్రముఖ కవి!
జీవిత చరిత్ర :
1930వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలో నివాసం వుండే హనుమాయమ్మ, నాయని సుబ్బారావు దంపతులకు నాయని కృష్ణకుమారి జన్మించారు. ఈమెకు ముగ్గురు చెల్లుళ్లు, ఒక తమ్ముడు వున్నాడు. శ్రీకాకుళంలోని నరసరావుపేటలో తన పాఠశాల చదువును పూర్తి చేసిన ఈమె.. గుంటూరులో కాలేజీ చదువును పూర్తి చేశారు. అనంతరం 1948లో తెలుగు ఎం.ఏ చేయడానికి విశాఖపట్నం వెళ్లారు. అంతకుముందే ఆమె తన 18వ ఏట బీ.ఏ. చదువుతున్న రోజుల్లో ఆంధ్రులచరిత్ర క్లాసులో రాసుకున్న నోట్స్ ఆధారంగా ‘‘ఆంధ్రులకథ’’ అనే ఒక పుస్తకాన్ని రాసి ప్రచురించారు. ఆ పుస్తకం అందరిచేత ప్రశంసలను అందుకోవడంతో ఆనాడు ఆంధ్రప్రభుత్వం ఆ పుస్తకాన్ని స్కూళ్లలో పాఠ్యపుస్తకంగా తీసుకుంది.
ఇక విశాఖలో ఎం.ఏ చదువుతున్న రోజుల్లో విశాఖలో ఆమెకి అనేకమంది ప్రముఖ రచయితలతో పరిచయం అయింది. కృష్ణకుమారి సాహిత్యసభలలో - నాటకాలలో విశేషంగా పాల్గొంటూనే... తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు. ఆమె తెలుగు యం.ఏ. అయిన తరువాత మద్రాసులో ఒక ఏడాది లెక్చరరుగా పని చేసి, తరువాత హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరరుగా ఆమె తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి... కాలక్రమంలో రీడర్, ప్రొఫెసర్ అయిన తరువాత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‍గా 1999లో రిటైరయేరు.
ఉస్మానియా యూనివర్సిటీలో తిక్కన కవితావైభవం మీద పి.హెచ్.డి పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టారు కానీ కుదరలేదు. అయితే ఆమె భర్త మధునసూదనరావు, ఆయన మిత్రుడు నరసింహం ప్రోత్సహించగా... తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఈమె రాసిన రచయితలకుగానూ గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి బహుమతి , ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి వంటి సత్కారాలు అందాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more