సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, దురాచారాలను అరికట్టే దిశగా నిరసనలు తెలిపిన ఎందరో మహిళా ప్రతిభావంతుల్లో ‘‘సిస్టర్ నివేదిత’’ ఒకరు! మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి, వారిని విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత... మహిళా విద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె పాఠశాలలను ప్రారంభించారు. కనీసం విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె నిత్యం పనిచేశారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి విదేశాల్లోని ముఖ్యనగరాల్లో సైతం ఆమె ప్రసంగించారు. అంతేకాదు... భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు. తన ప్రసంగాలతో దేశాభివృద్ధికోసం ప్రజల్లో చైతన్యపరిచిన వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా చరిత్రలో నిలిచిపోయారు.
జీవిత చరిత్ర :
ఐర్లాండులో నివాసం వున్న మేరి ఇసబెల్, శ్యాముల్ రిచ్‌ముడ్ నోబుల్ దంపతులకు 1867 అక్టోబర్ 28న సిస్టర్ నివేదిత జన్మించింది. ఈమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. ఇలా తండ్రి చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక మాటలతో ఈమె పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు 10 సంవత్సరాలవరకు ఈమె ఇంగ్లాండులో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. వివేకానందుని ప్రసంగం ద్వారా భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె.. ఆయనతో కలిసి 1898 జనవరి 28న భారత్ చేరింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘‘ది మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’’ పుస్తకంలో వివరించారు.
భారతదేశంలో నివేదిత జీవితం :
ఉపాధ్యాయురాలిగా అనుభవం ఉన్న నివేదిత.... భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజారులో ఒక పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఎంతగానో ఆకాంక్షించారు. బెంగాల్ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు.
భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ , షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు. విదేశీయురాలు అయినప్పటికీ భారతీయతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె.... 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించారు. ప్రస్తుతం ఆమె పేరుమీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more