నేటి ప్రపంచంలో గణితశాస్త్రం అంటే యువతీ-యువకులందరూ ఆమడదూరంలో వుంటారు.. అందులోని ఫార్ములాలు, ఇతర విభాగాలు పిచ్చెక్కిస్తాయంటూ దానిమీద అంతగా దృష్టి సారించరు. కానీ శకుంతలాదేవి మాత్రం ఈ గణితశాస్త్రాన్ని అవపోసన చేసి.. ప్రపంచవ్యాప్తంగా ‘‘మానవ గణనయంత్రం’’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి ‘‘గణనయంత్రం’’ కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. పలు పుస్తకాలను కూడా రచించింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈమె ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త కూడా!
జీవిత చరిత్ర :
1929 నవంబర్ 4వ తేదీన బెంగుళూరు నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తన బాల్యంనుంచే మంచి ప్రతిభను కనుబరస్తూ ఇతర విద్యార్థులకంటే చాలావేగంగా వుండేది. పాఠశాల నుంచి కళాశాల చదువులవరకు ఈమె ఏనాడు వెనుదిరిగి చూడలేదు. అధ్యాపకులు సైతం ఈమె వేగాన్ని అంచనా వేయలేకపోయారు. ముఖ్యంగా గణితంలో ఈమె వేగాన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు. తన బాల్యంనుంచే గణిశాస్త్రాన్ని అవపోసన చేసుకున్న ఈమె... ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. కంప్యూటర్ కంటే వేగంగా సమాధానాలు చెప్పడంలో తనకు తానే సాటిగా నిలబడింది. ప్రపంచ దిగ్గజాలు సైతం ఈమెకున్న అద్భుత గణిత జ్ఞానాన్ని ఆశ్చర్యపోయారు.
1977వ సంవత్సరంలో అమెరికాలో ఒకనాడు శకుంతలా దేవి గణితజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఒక కంప్యూటర్ తో పోటీ పెట్టారు. ఆ పోటీలో భాగంగా 188132517 అనే సంఖ్యకు మూడోవర్గం కనుక్కోవడంలో పోటీ పెట్టగా.. అందులో ఆమె కంప్యూటర్ నే ఓడించేశారు. అలాగే 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో 18,947,668,177,995,426,462,773,730 అంటూ సమాధానం ఇచ్చారు. ఆ దెబ్బతో గిన్నెస్ రికార్డ్ ఆమెకు సొంతమైంది.
ఈమె సాధించిన ఇతర ఘనతలు :
1. ఆరేళ్ల వయస్సులోనే తొలిసారిగా మైసూర్ విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.
2. ఎనిమిదేళ్ల వయస్సులో అన్నాములై విశ్వావిద్యాలయంలో ఆమె ప్రదర్శించిన ప్రతిభను ‘‘బాలమేధావి’’గా గుర్తించారు.
3. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకెండ్లలోనే సమాధానం చెప్పేశారు.
4. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా.. అది ఏ వారమవుతుందో చిటికెలోనే సమాధానం చెప్పేశారామె.
ఇలా చెప్పుకుంటూపోతే ఆమె జీవితకాలమంతా సమాధానాలు కరెక్టుగానే దొరుకుతాయి. కంప్యూటర్ అయినా అబద్ధం చెబుతుందోమోగానీ.. శకుంతలా మాత్రం చెప్పదనంతే ఘనతను సాధించడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు.. ఆమె ‘‘ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్’’ లాంటి పుస్తకాలను కూడా రాశారు. అయితే గుండె, మూత్రపిండాల సమస్యలతో తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more