బ్రిటీష్ పాలకులనుంచి భారతదేశానికి స్వాతంత్ర్య సౌభాగ్యం కల్పించిన మహాత్మాగాంధీ భార్య కస్తూరిబాయి కూడా ఆ సమరంలో తనదైన సేవలను అందించింది. గాంధీ నడిచిన బాటలోనే నడుస్తూ.. మహిళల్లో స్వాతంత్ర్యంపై చైతన్యం పెంచడంలో ఈమె సేవలు అమోఘం. ఎన్నో వ్యతిరేక తిరుగుబాట్లలో పాల్గొన్ కస్తూరిబాయి కూడా నెలలపాటు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. గాంధీ జైల్లో వున్న సమయంలో కొన్నిసార్లు ఆయన స్థానంలో ఈమె పనిచేసేది. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో తనవంతు పాత్ర పోషించిన కస్తూరి.. వారికి క్రమశిక్షణ, విద్యను నేర్పించింది.
జీవిత విశేషాలు :
1869 ఏప్రిల్ 11వ తేదీన పోర్బందర్ లో ధనవంతుడైన వ్యాపారస్తుడైన గోకులదాస్ కపాడియాకు కస్తూరిబాయి గాంధీ జన్మించింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో ఆమె గాంధీజితో బాల్యవివాహం చేసుకున్నారు. అప్పుడు ఇద్దరి వయస్సు 13 సంవత్సరాలు. ఈ దంపతులకు మణిలాల్ (1892), రాందాస్ (1897), దేవదాస్ (1900) అని ముగ్గురు కుమారులు. ఈమె చదువులో అంతగా ప్రావీణ్యం పొందలేదు గానీ.. స్వాతంత్ర్యం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కోగలిగింది.
రాజకీయ జీవితం :
వివాహం జరిగిన అనంతరం కస్తూరిబాయి తన భర్తతో కలిసి వుండటానికి 1897లో దక్షిణాఫ్రికా వెళ్ళింది. అక్కడున్న భారతీయుల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈమె నిరసన వ్యక్తం చేసింది. 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ లో చురుకుగా పాల్గొంది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో ఆమె అరెస్టు కాబడి.. మూడునెలల కారాగార శిక్షను అనుభవించింది. అంతేకాదు.. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం భర్త జైలులో వున్న సమయంలో ఆమె తన భర్త స్థానంలో పనిచేసింది. స్త్రీలు, పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం, వ్రాయటం నేర్పించింది. గాంధీజీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం, సబర్మతి ఆశ్రమ లక్ష్యాలకు అనుగుణంగా తన సేవలు అందించింది.
వ్యక్తిగత జీవితం :
పుట్టుక సమయంలో వచ్చిన ఇబ్బందుల మూలంగా కస్తూరిబాయి దీర్ఘమైన శ్వాసనాళముల వాపుకు గురయ్యింది. అయితే ఉద్యమాల నేపథ్యంలో కఠినమైన జీవనం కొనసాగించడంతో ఆమె శ్వాసనాళముల వాపుతో జబ్బుపడింది. అది తరువాత న్యూమోనియా(ఊపిరితిత్తుల వ్యాధి)తో మరింత తీవ్రం అయింది. జనవరి 1944లో, కస్తూరిబాయికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ వ్యాధినుంచి ఆమెను కాపాడుకోవడానికి గాంధీజీతోపాటు వారి కుమారులు ఎంతగానో ప్రయత్నించారు గానీ.. ఫలితం లేకపోయింది. పూణే జైలులో వుండగానే గాంధీ చేతులలో 1944 ఫిబ్రవరి 22వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more