నేటి జనరేషన్’లో పురుషులతోబాటు సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే! కానీ దశాబ్దాల క్రితం అలా వుండేదికాదు. ఏ రంగంలోనైనా రాణించాలన్నా సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో కూడా కొందరు మహిళామణులు ఆత్మస్థైర్యంతో ముందడుగువేసి నలుగురికి ఆదర్శంగా నిలిచినవారున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము అందరికంటే తక్కువకాదంటూ అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోగలిగారు. అటువంటివారిలో అనసూయ కులకర్ణి కూడా ఒకరు.
అనసూయ ప్రముఖ సంగీత విధ్వాంసురాలు, తెలుగు సినిమా నేపధ్య గాయని. లలితకళల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగిన ఈమె.. అందులో అభ్యాసం పొంది అవలోకన చేసుకున్నారు. అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు.. విదేశాల్లో సైతం విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.
జీవిత విశేషాలు :
బాల్యంనుంచే సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కనబరిచిన ఈమెను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు. అందులో భాగంగానే ఆమెకు సంగీతరంగంలోనే ప్రత్యేక శిక్షణను కల్పించారు. అలా వారి ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలోగాన కళారత్న ఆర్.ఆర్.కేశవమూర్తి శిష్యరికంలో ఆమె ఓనమాలు దిద్దింది. అనంతరం 1952లో బెంగుళూరు ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్ అకాడమీ నుంచి గోల్డ్మెడల్ అందుకొని, విశేషంగా నిలిచింది. ఆనాడు ఆమె గానమాధుర్యానికి ఆకర్షితులైన ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు.. 1961లో అతను తెరకెక్కించిన ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.
వివాహం చేసుకున్న తర్వాత దేశవిదేశాలు తిరిగిన ఈమెకు.. అక్కడి సంగీత వాతావరణాన్ని తెలుసుకోవడంతో ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. ఉద్యోగరీత్యా భర్త మారిన ప్రదేశాల్ల ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం ఆమెకు లభించింది. ఆ విధంగా శిక్షణ తీసుకున్న ఆమె ఆయా ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more