సాధారణ చిత్రపరిశ్రమ అన్న తర్వాత దానికి భాష, మత, ప్రాంతం వంటివి భేదాలుండవు. ఇతర రాష్ట్రాలు, దేశాలు, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి దేశవిదేశాల్లో వున్న ప్రతి ఒక సినీ పరిశ్రమలోనూ నటీనటులు ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ అవుతుంటారు. ఇక ఇండియన్ పరిశ్రమలోనూ ఇప్పటికే ఎందరో నటీనటులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇంపోర్ట్ అయి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారున్నారు. అటువంటివారిలో సుజాత ఒకరు. శ్రీలంక దేశంలో పుట్టిపెరిగిన ఈమె.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించి, ప్రసిద్ధ నటిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
జీవిత చరిత్ర :
1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో నివాసమున్న మలయాళి దంపతులకు సుజాత జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఈమె అక్కడే జన్మించింది. బాల్య జీవితాన్ని ఇక్కడే గడిపింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. కేరళకు వచ్చిన అనంతరం ఈమెకు సినిమాల్లో నటించే అవకాశాలు వరించాయి.
సినీ జీవితం :
సుజాత పద్నాలుగేళ్ల వయస్సులోనే ‘తబస్విని’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించడంతో ఈమెకు మరిన్ని మూవీ అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో వచ్చిన ఆఫర్లు ఏమాత్రం తిరస్కరించకుండా వరుసగా నటిస్తూ తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏడేళ్ల వ్యవధిలో ఈమె 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అవళ్ ఒరు తొడర్ కథై’ (తెలుగులో ‘అంతులేనికథ’) మూవీతో నటిగా వెలిగిపోయింది.
సుజాతను దాసరి నారాయణరావు ‘గోరింటాకు’ (1979 సినిమా) చిత్రంద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. ‘గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు’ ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి (సినిమా) చిత్రానికిగాను ఈమెకు నంది అవార్డు వచ్చింది. అలాగే తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘కలైమామణి’ అవార్డు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం :
సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more