చిత్రపరిశ్రమలో నటీనటుల మధ్య పోటీ ఎంతమేర వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కథానాయికల విషయానికొస్తే.. అందంతోపాటు తమ అభినయంతోనూ ప్రేక్షకులను అలరించగలగాలి. నటనలో తమ ప్రతిభ కనబరిచి ఒక ప్రత్యేక స్థానాన్ని గడించాలి. అలా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొందరు ప్రముఖ నటీమణుల్లో ఈ.వి.సరోజ ఒకరు. భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించిన ఈమె.. 1950, 60 దశకాల్లో నటిగా ప్రసిద్ధి చెందింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల ఆదరణను పొంది.. వారి మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
జీవిత విశేషాలు :
1935 నవంబర్ 3న తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న ఎణ్కణ్ అనే కుగ్రామంలో చాలా సాధారణమైన కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఎంతో చురుకుగా వున్న ఈమెకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం వుండేది. ఈమె ఇష్టాన్ని గ్రహించిన ఆమె బంధువు వళువూర్ రామయ్య.. ఆమెకు భరతనాట్యం నేర్పించడంలో కృషి చేశాడు. ఆయన సహాయంతో చిన్న వయస్సులోనే భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించింది. అంతేకాదు.. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసింది.
1951లో ‘ఎన్ తంగై’ (నా చెల్లెలు) సినిమా ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. ఆ సినిమాలో ఆమె ఎం.జి.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత ఈమె నటించిన ‘గుళేబకావళి’, ‘వీర తిరుమగన్’, ‘మదురై వీరన్’ సినిమాల ద్వారా నటిగా ప్రత్యేక పేరు సంపాదించింది. అనంతరం ఈమెకు నటిగానే కాకుండా ప్రత్యేక పాత్రల్లో నటించే ఆఫర్లు కూడా వరుసగా వచ్చాయి. దాదాపు 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన ఈమె.. వందకుపైగా తమిళ, తెలుగు, హిందీ భాషలతోపాటు ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది.
నటిగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న రోజుల్లో ప్రముఖ తమిళ దర్శకుడు టి.ఆర్.రామన్నను సరోజ వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే.. క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. చివరిరోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఈమె.. 2006 అక్టోబరు 3వ తేదీన గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more