ప్రొతిమా బేదీ.. ప్రస్తుత ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. కొన్ని దశాబ్దాల క్రితమే న్యూడ్ గా ఫోటోషూట్ ఇచ్చి పనుసంచలనానికే దారితీసింది. ఓ పత్రిక కోసం నగ్నంగా ఫోజులిచ్చినందుకుగాను దేశవ్యాప్తంగా ఈమెపై విమర్శల వెల్లువ కురిసింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లోనూ అర్థనగ్నంగా ఫోటోషూట్ లు ఇచ్చి.. ఎన్నో వివాదాలకు తెరలేపింది. అయితే.. ఆ తర్వాత ఈమె జీవితంలో అనుకోకుండా ఓ మలుపు చోటు చేసుకుంది. అప్పటివరకు నగ్నంగా పోజులిచ్చేందుకు ఏమాత్రం వెనకడుగు వేయని ఆమె.. ఆ తర్వాత సంప్రదాయ మహిళగా మారింది. అప్పటి నుంచి ఈమె ప్రొతిమా గౌరిగా పిలువబడుతోంది. కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.
జీవిత విశేషాలు :
1948 అక్టోబరు 12వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీచంద్ గుప్తా, రేబ దంపతులకు ప్రొతిమా బేదీ జన్మించింది. మొదట ఢిల్లీలో నివాసమున్న ఈ దంపతులు వృత్తిరీత్యా గోవాకి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి అక్కడి నుంచి 1957లో ముంబయికి మారింది. అప్పుడు ప్రొతిమా వయస్సు 9 సంవత్సరాలుండగా.. ఆమె కొంతకాలం కర్నూల్ జిల్లాలోని తన మేనత్త దగ్గరకు పంపబడింది. అక్కడే స్థానిక పాఠశాలలో కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసింది. తిరిగి అక్కడి నుంచి ముంబైకి వెళ్లిన తర్వాత అక్కడ బాలికల వసతి పాఠశాల అయిన కిమ్మిన్స్ హై స్కూల్’లో విద్యాభ్యాసం చేసింది. తరువాత ఆమె సెయింట్ జేవియర్ కళాశాల, బొంబాయి (1965–67) నుండి స్నాతక పట్టా పొందింది.
విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే ప్రొతిమా బేదీకి మోడలింగ్ పై ఎక్కువ ఆసక్తి వున్న నేపథ్యంలో అటువైపు అడుగులు వేయసాగింది. మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన అనంతరం తొలినాళ్లలో కాస్త కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ.. 1960లోని చివరి రోజుల్లో ఆమె ప్రముఖ మోడల్ గా ఎదిగిపోయింది.. ఇక అక్కడి నుంచి మోడల్ గానే కెరియర్ ను కొనసాగించిన ఆమె.. ఎన్నో వివాదాలను సృష్టించడంలో రికార్డు నమోదు చేసింది. 1974లో సినీబ్లిట్జ్ అనే బాలీవుడ్ పత్రిక ప్రారంభోత్సవం కోసం బొంబాయిలోని జుహు బీచ్లో పగటి సమయంలోనే నగ్నంగా పరుగెత్తి వార్తల్లోకి ఎక్కింది. అప్పట్లో ఆమె అలా నగ్నంగా పరిగెత్తడంపై పెద్ద దుమారమే రేగింది. ఎందరో మహిళసంఘాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే.. ఆమెను అంత అసభ్యంగా చూపించిన పత్రికపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీద అప్పట్లో ఎన్ని విమర్శలొచ్చినా.. తనకు వాటితో ఏ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించింది. అయితే.. ఆ తర్వాత ఈమె జీవితంలో ఓ మలుపు వచ్చింది.
26 ఏళ్ల వయసున్నప్పుడు ప్రొతిమా భూలాభాయి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ లో అనుకోకుండా ఇద్దరు నాట్యకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శనను చూసింది. అదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వారు ప్రదర్శించిన ఆ కళావిధానానికి ముగ్ధులైన ఈమె.. ఆ నృత్యంవైపు అడుగులు వేసింది. ఆ నాట్యాన్ని నేర్చుకోవడం కోసం ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరగా ఆమె ఓ మోడల్ యువతి నుంచి ప్రొతిమా గౌరిగా రూపాంతరం చెందింది. అలా కళాకారిణిగా మారిన ఈమె 1990లో బెంగుళూరు సమీపంలో ఒక నాట్య గ్రామమైన 'నృత్యగ్రామ్'ను స్థాపించింది. కొంతకాలం తరువాత ఈమె తన విద్యార్ధులతో ఆప్యాయంగా గౌరి అమ్మగా అని పిలువబడింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more