కలలు కనండీ.. వాటిని సాకరం చేసుకునేందుకు కష్టపడండీ అన్న మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన వ్యాఖ్యలు అమెలో ఎంత ప్రభావం చూపాయో తెలియదు కానీ స్వయంగా అయన చేతుల మీదుగా అవార్డును అందుకుని, అయన నోటి నుంచి అమె గురించి నాలుగు మాటలు చెప్పగానే ఆ సభావేదికలోనే అమె మనస్సు.. అవధులు లేనంత సంతోషంలో ఓలలాడింది. అమె తన వృత్తిలో రాణిస్తూనే.. ప్రవృత్తిలో కూడా అందలాన్ని అందుకోవాలని కలాం చేసిన ప్రసంగానికి అమె ముగ్దురాలైంది.
ఓ దేశ మాజీ రాష్ట్రపతి తనపై ఇంతటి అభిమానం చూపడానికి కారణం.. అమె నృత్యమే. అమె నాట్యప్రదర్శనను వీక్షించిన కలాం.. అమెను కొనియాడకుండా వుండలేకపోయారు. ఈ క్రమంలో అమె అటు వైద్యురాలిగా కూడా సేవలందిస్తుందని తెలిసి.. అమె అటు తన వృత్తిలోనూ రాణించాలని అకాంక్షించారు. దీంతో అప్పటి వరకు అమె వృత్తి వైద్యం అయితే ప్రవృతి నాట్యం అని అనుకున్నవారందరూ అమె గురించి పూర్తిగా తెలుసుకుని తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.
అమె మరెవరో కాదు ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి వైద్య పట్టాను అందుకున్న ఇరవైమూడేళ్ల డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. చదువూ, భరతనాట్యం.. యోగా.. సేవా.. అందాలపోటీలు..ప్రధానమంత్రి పతకం.. షూటర్, సింగర్, ఇలా ఎన్నో కళలలో ప్రావిణ్యాన్ని సంపాదించి.. తనకంటూ సముచిత స్థానాన్ని అందుకుంది. ఇక తాజాగా ఓ వైపు మిస్ దివా పోటీలకు సిద్దమవుతూనే.. మరోవైపు వైద్యవిద్యలో పీజీ, సివిల్స్‌పై దృష్టి పెట్టింది.
చదువుకుంటున్నప్పుడే అమెకు అందాల పోటీలతో పాటు అరోగ్యం సూత్రాలను పాటించడంపై ఆసక్తి కలిగింది. దీంతో అటు చిన్నతనం నుంచి అందాలపోటీలలో పాల్గొని బహుమతులను సాధించింది. దీంతో అమెకు అందాలపోటీలలో పాల్గోని విజయాన్ని అందుకుంటే ప్రజలకు సేవ చేసే అవకాశం అధికంగా లభిస్తుందని భావించింది. ఇక మరోవైపు పాఠశాల విద్యాబోధన సమయంలోనే అటు ఎన్.సీ.సీ లో కూడా రాణించింది. ఇంటర్ చదువుతూ ఎన్సీసీలో ఏబిసీ విభాగాలు పూర్తి చేశానని తెలిపింది. ఢిల్లీలో శిక్షణ తీసుకుంటూ 13 లక్షల మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో అనేక స్థాయుల్లో డ్రిల్, కవాతు, బృంద చర్చ, రైఫిల్ షూటింగ్, త్రివిధ దళాల అధికారులతో ఇంటర్యూలు చేశానని తెలిపింది.
అన్ని విభాగాల్లో పాల్గొని 2010లో ఎన్సీసీలో ‘ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్’గా నిలివడంతో తనకు ప్రధానమంత్రి పథకం అభించిందని చెప్పింది. దీనిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన చేతుల మీదుగా బహుకరించడం అమెకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. అలాగే శ్రీలంకలో నిర్వహించిన సార్క్ దేశాల యువ ప్రతినిధుల సదస్సులో మన దేశం నుంచి యూత్ అఛీవర్ గా వెళ్లంది. రాష్ట్రపతీ, రక్షణశాఖ మంత్రి, ఆర్మీ దళాలతో తేనీటి విందు ఇవన్నీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని తెలిపింది.
అయితే అందాల పోటీలలో విజయాన్ని కూడా సాధించాలన్న పట్టుదలతో వుంది. అందుకే ఆ మధ్య జరిగిన యమహా ఫాసినో మిస్ దివా-2017 ఆడిషన్స్‌కు వెళ్లానని. అందులో తొలి విడతగా సదరన్ మిస్ దివా పోటీల్లో పాల్గొన్ని విజేతగా నిలిచానని తెలిపింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నానని కూడా తెలిపింది. ఆ తరవాత మిస్ యూనివర్స్.. అందులో గెలుపొందితే గనుక ఐకరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని అశిపడుతుంది.
తన కలసాకారమైన పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు, పిల్లలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని తేజస్విని ఆలోచన. ఈ పోటీలకు వెళ్లడానికి కారణం కూడా అదేనని చెబుతుంది ఈ మహబూబ్ నగర్ పట్టణపు అమ్మాయి. అయితే మహబూబ్ నగర్ తన సోంత గ్రామమైనా.. తాను అలనాపాలనా సాగింది మాత్రం రాజధాని హైదరాబాద్ లోనే నని చెప్పిన ఈ సకళ కళా తేజస్వినీ.. తాను పలు రంగాలలో రాణించడానికి కారణం మాత్రం తల్లిదండ్రులు మదన్ మోహన్ శర్మ, అనితలే నని చెబుతుంది. నాన్న బ్యాంకు ఉద్యోగికాగా, తల్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగినని, వారి ప్రోద్భలంతోనే చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నానని చెబుతుంది.
అమ్మ మంచి గాయని కాబట్టి అమె స్వతహాగా పాటులు పాడుతుండటంతో అమె వద్ద సంగీతం నేర్చుకున్నానని.. ఇక పాఠశాల స్థాయిలోనే స్కూల్ లో ఉండగానే నాట్య ప్రదర్శనలు ఇచ్చానని చెబుతుంది. వీటిల్లో ఎక్కువగా సేవా కార్యక్రమాల కోసం చేసినవే. అంటే ఫండ్ రైజింగ్ కోసమే ప్రదర్శనలు ఇచ్చానని తెలిపింది. అలా ఇప్పటి వరకు 2500 వరకూ ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చింది. అమెరికాలోనూ రెండుసార్లు ఓ సేవా కార్యక్రమం కోసం ప్రదర్శన ఇచ్చా.
పదో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో యోగాలో డిప్లొమా చేశాను. అప్పుడు తమ గురువు జూనియర్స్ కు తరగతులను తనతో చెప్పించేవారు. ఖాళీ సమయంలో తరగతులు కావాలని అడిగిన వారికీ కూడా శిక్షణ ఇచ్చేదానినని మనోజ్ఞ తెలిపింది. అంతేకాదు.. కొండాపూర్‌లోని 8వ పోలీస్ బెటాలియన్, యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలో శిక్షణ పొందే పోలీసు సిబ్బందికి ఈ ఏడాది యోగాలో శిక్షణ ఇచ్చానని తెలిపింది. ఏ సమస్యలు ఉన్నవారు ఏ ఆసనాలు వేయాలి వంటివి శాస్త్రబద్దంగా వివరిస్తూ చెప్పడం వల్ల అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడేవారని చెబుతుంది ఈ తేజస్వినీ మనోజ్ఞ. మరి మనమూ ఈ సకల కళా శిల్పానికి హ్యాట్సాఫ్ చెప్పి.. అల్ ది బెస్ట్ చెబుదామా..!
(images source: INK 361/tejaswinimanogna)
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more