No t discussion in parliament today

no t discussion in parliament today, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

t-discussion.gif

Posted: 11/24/2011 11:08 AM IST
No t discussion in parliament today

parliament-phota    

శీతాకాలం సమావేశాలు వస్తున్నాయ్ వస్తున్నాయంటూ ఎదురు చూడటం జరిగింది, అప్పుడే రెండు రోజులు అయిపోయాయి కూడా. కానీ పార్లమెంటు సమావేశాల్లో జరగవలసిన కార్యకలాపాలేమీ జరగలేదు. ప్రత్యేక తెలంగాణా, రోజురోజుకీ పెరుగుతున్న ధరలు ఈ అంశాలమీద ఆందోళన చేస్తూ ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయంలో ఏమీ చెయ్యకుండా చెయ్యటంతో రెండు రోజులు వృదాగానే పోయాయి. అలాగని మాట్లాడకుండా ఊరుకుంటే వీళ్ళు చేద్దామనుకున్న ప్రతిపాదనలు వెనక్కిపోయే అవకాశమూ లేకపోలేదు. అందుకే గలాటా చెయ్యవలసివస్తుంది.

     ఈ విషయం మీద చర్చించటానికి, ఈ చిక్కుముడిని విప్పటానకి నిన్న ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. లేకుంటే శీతాకాలం వెళ్ళిపోయేట్టుంది. ఈ భేటీ పుణ్యమాంటూ ఈ రోజు పార్లమెంటు సమావేశాలు పద్ధతిగా జరిగేట్టుగానే ఉన్నాయి. అందుకు కారణం, ఈ రోజు నల్లధనం, అధిక ధరల మీద చర్చలు జరపటానికి ఒప్పందం జరిగింది. అంటే ఈ రోజు తెలంగాణా అంశం తెరమీదకు రానట్టే.

     పాలక పక్షానికి కానీ, ప్రతిపక్షానికి కానీ తెలంగాణా ఏర్పాటనేది మొత్తం దేశంలోని సమస్యల్లో ఒకటి. అన్నిటికన్నా ముందు పార్టీ బలోపేతం చేసుకోవటం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లలో తమ మీద సదభిప్రాయాన్ని కలుగజేసుకోవటం, సద్భావనను (గుడ్ విల్) పెంచుకోవటం, దీని తర్వాత దేశంలోని అతి ముఖ్యమైన సమస్యల మీద దృష్టి సారించటం.   ఆ తర్వాతనే రాష్ట్రాల సమస్యలు. అవికూడా తమ పార్టీకి కాస్త మంచి జరుగుతుందంటే. ఈ నేపథ్యంలో తెలంగాణా అంశం పార్లమెంటులో ఎంత ప్రాధాన్యతను కలిగించుకుంటుందో వేచి చూడాల్సిందే.

     ఆందోళన చేస్తూ సమావేశాలను అడ్డుకుంటున్న విషయాలే కాకుండా, ఏమీ చెప్పకుండా ఎదురు చూస్తున్నవి, లోక్ పాల్ కోసం అన్నా చేసే ఆందోళన, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర విభజన, వీటి వెనక తెలంగాణా ఆందోళన ఎంత వరకూ ఎదురొడ్డి నిలబడుతుందో చూడాలి

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda lakshman bapuli padayatra at delhi
Ap cm kiran kumar reddy almost completes one year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles