Telugu desam party

telugu Desam party 30 years, telugudesam party on Facebook Telugudesam party Youtube Channel

telugu Desam party 30 years

telugu Desam party.gif

Posted: 03/28/2012 10:44 AM IST
Telugu desam party

TDP-30 years Celebrations

ఈ నెల 29వ తేదీతో తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్లు నిండుతాయని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 30 ఏళ్లుగా పార్టీని కాపాడేందుకు కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, రాష్ట్ర ప్రజలు కూడా పార్టీని ఆదరించారని వారందరికీ బాబు అభినందనలు తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ ఆనాడు పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని 30 ఏళ్లను టిపిడి పూర్తి చేసుకుందన్నారు. అధికారం కోసం పార్టీని స్థాపించలేదని, నిస్వార్థంగా తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్‌ పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోయిందని, మంత్రులను కూడా సిబిఐ విచారించే స్థాయికి వచ్చిందన్నారు. తమకు తెలియకుండా అధికారులే ఉత్తర్వులు జారీ చేశారని, ఈ ఉత్తర్వులపై గతంలో ఉన్న సిఎంకు రహస్యలేఖ రాశానని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ రహస్య లేఖను బయటపెట్టాలని, అందులోని అంశాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రాష్ట్రంలో జరిగినన్ని ఉప ఎన్నికలు దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదని, ఇవి ఎవరి కోసమని ప్రశ్నించారు. కొంతమంది స్వార్థపరుల కుట్ర వల్ల ఉప ఎన్నికలు వస్తున్నాయని, వీటిని ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు కోసం చట్టబద్ధత అవసరమని, వారి నిధులను మళ్లించడం సరైంది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లను నిర్మించాలనే జీవోను దివంగత వైఎస్‌ ప్రభుత్వం మార్చేసిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీల కోటాను కూడా ఇతరులకు మళ్లించారని తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jhina writes to chief minister
Will balwant singh rajoana be hanged on saturday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles