Congress leaders openly attack ysr

Congress leaders openly attack YSR,YS Rajasekhara Reddy, Andhra Pradesh by-elections, Jaganmohan Reddy

Congress leaders openly attack YSR

Congress.gif

Posted: 04/10/2012 10:25 AM IST
Congress leaders openly attack ysr

Congress leaders openly attack YSR

ఒక పార్లమెంట్‌ స్థానంలోను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో లేకుండానే ప్రచార పర్వాన్ని చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లా కోవూరు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కూడా అధికార పార్టీ వైఎస్‌ఆర్‌ పేరు ఉచ్ఛరించలేదు. ఉపఎన్నికలు జరుగబోయే 18 శాసనసభా నియోజకవర్గాలు,. దీనిని బట్టి మెల్ల మెల్లగా ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్‌లోనూ వైఎస్‌ఆర్‌ మార్క్‌ను తొలగించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. కాగా, ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (వైఎస్‌ఆర్‌సి) అధినేత, కడప ఎంపీ జగన్మోనహన్‌ రెడ్డి అవినీతిని ఎండగట్టాలని, అభివృద్ధిని వివరించాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది.

ఈ ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయి? ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఇందులో ఉన్నాయనేది ప్రజలకు తెలుస్తుందని సోమవారం విలేఖర్లతో మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడచిన ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాము ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుంచీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ వైఎస్‌ఆర్‌సి అధినేత జగన్మోహన్‌ రెడ్డి అబద్ధాలతో ప్రజల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బొత్స దుయ్యబట్టారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌లు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది సిబిఐ దర్యాప్తులో తెలుస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్‌ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ ఒక్క అధికారినీ కలుసుకోలేదని చెప్పుకుంటున్నప్పటికీ 'వడ్డించేవాడు మనవాడైతే' ఎవరినీ కలుసుకోవలసిన అవసరముండదని పిసిసి అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌ ఆస్తికి మాత్రమే జగన్‌ వారసుడు తప్ప రాజకీయాల్లో వారసుడు కారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mla missing in khammam forests
Congress rajya sabha leader chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles