తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయాన్ని నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ మంగళవారం స్వంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై మరో విజయాన్ని సాధించి అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కాగా, మరో వంక 'స్టార్' ఆటగాళ్ళతో నిండిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అనూహ్యంగా విఫలం కావడంతో ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి సాదాసీదా జట్లపై ఎదురైన ఈ ఓటమి రైడర్స్ సారధి గంభీర్‌కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తనతో పాటు బ్రెండన్ మెక్‌కల్లమ్, కలిస్, దేబ్రతదాస్ ఆరు ఓవర్లలో కేవలం 25 రన్స్‌కే వెనుదిరగడంతో కలిసి కట్టుగా విఫలం కావడంతో ఓటమి అనివార్యం కాగా, ఈ మ్యాచ్‌లో కూడా అదే బాటలో నడిచినట్లయితే నైతికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని గంభీర్‌కు తెలుసు. ఈ నేపథ్యంలో మెక్‌కల్లమ్, కలిస్ తొలి వికెట్‌కు శుభారంభం అందించాలని, తరువాత నైట్‌రైడర్స్ తరఫున తొలి అర్ధ సెంచరీ సాధించిన మనోజ్ తివారీతోపాటు యూసుఫ్ పఠాన్, బ్రాడ్ హడిన్ , లక్ష్మీ శుక్లా వంటి ఆటగాళ్ళు పరుగుల జోరు కొనసాగించాలని ఆశిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో బ్రెట్‌లీ, ఇక్బాల్ అబ్దుల్లా, మర్చంట్ డిలాంగె కీలకం కానున్నారు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ విషయానికొస్తే, డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 42 బంతుల్లో 64 రన్స్, వెటరన్ స్పిన్నర్ మురళీధరన్ 25 రన్స్‌కే మూడు వికెట్లు తీసుకోవడంతో విజయాన్ని అందుకోగా ఈ మ్యాచ్‌కు క్రిస్ గేల్‌తోపాటు దిల్షాన్‌కూడా అందుబాటులోకి వస్తుండటంతో పూర్తి స్థాయిలో సన్నద్ధమౌతోంది. అలాగే యువ సంచలనం విరాట్ కోహ్లీతోపాటు ఆండ్రూ మెక్‌డొనాల్డ్, మయానక్ అగర్వాల్‌లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా వుంది. బౌలింగ్ విభాగంలో జహీర్‌ఖాన్, వినరుకుమార్‌లతో పాటు హర్షల్ పటేల్, కెప్టెన్ వెటోరీ ఆల్‌రౌండ్ షో ఛాలెంజర్స్‌కు సానుకూలాంశం కానుంది. మొత్తంమీద సమఉజ్జీల పోరు రసవత్తరంగా సాగే అవకాశం వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more