మన దేశంలో 500కుపైగా ఐటీ సర్వీసుల్లో పనిచేసే నిపుణులు రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీస్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఈ అంశంపై శరణ్ 2001 నుంచి 2009 వరకు అధ్యయనం నిర్వహించారు. 35 వేల మందిని సర్వే చేశారు. మీరు చాలా సమయం కూర్చొనే పని చేస్తున్నారా? అయితే తగిన వ్యవధిలో విరామాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నిరంతరం కూర్చోవడం, అస్తవ్యస్థంగా కూర్చోవడం వల్ల కళ్లకు ఇబ్బందే కాకుండా 'రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీస్' కలుగుతాయి. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీస్ అంటే శరీర అవయవాలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే జబ్బు గ్రూపునకు చెందినవి. దీని వల్ల కండరాలు, టెండాన్లు, మెదడులోని నరాలు, నడుం పైభాగం, కింది భాగం, ఛాతి, భుజాలు, చేతులు ప్రభావితం అవుతాయి. చాలా సమయం పనిచేసి మెడ తిప్పడంలో ఇబ్బందిగా ఉన్నా, చేతి వేళ్లు, చేతుల్లో తరచూ నొప్పి కలుగుతున్నా తక్షణం వైద్యసహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న నొప్పుల్లాగా పెరిగి ఇవి క్రమంగా మన జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీస్ లక్షణాలు ఇలా ఉంటాయి. నొప్పి, మంటగా ఉండటం, మొద్దుబారిపోవడం, జలదరించడం, తలతిరగడం, దృఢంగా ఉండటం, వికృతంగా ఉండటం, వాపు ఉంటాయి. ఇలాంటి లక్షణాలున్నప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవాలి, లేకుంటే ఇవి దీర్ఘకాలం వ్యాధుల్లాగా పరిణమిస్తాయని రికూప్ న్యూరోమస్కులోస్కెల్టల్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన రిహాబిలిటేషన్ అండ్ ఎర్గొనామిక్స్ కన్సల్టెంట్ దీపక్ శరణ్ తెలిపారు.
ఇందులో 75 శాతం మంది రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్నవారే ఉన్నారని వెల్లడించారు. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీస్ వల్ల మెడ, నడుం పైభాగంతో 60 శాతం మంది బాధపడుతున్నారు. నడుం కింది భాగం నొప్పితో 40 శాతం మంది బాధపడుతున్నారు. సర్వే చేసిన 20 శాతం మందిలో ఇవి సాధారణ జబ్బుల్లా మారాయి. నిరంతరం నొప్పి, మొద్దిబారిపోవడం వంటివి వీరిలో కనిపించాయి. అధ్యయనంలో పాల్గొన్నవారి వయసు 27 ఏళ్లు. ఈ సమస్య గుర్తించిన వారిలో చాలా మంది పురుషులే ఉన్నారు. అంతేకాక వీరు రెగ్యులర్‌గా పనిచేసే వారే. ఈ సమస్యలు కేవలం కంప్యూటర్‌పై కూర్చొని ఉద్యోగాలు చేసే వారికే కాదు, చాలా సమయం విరామం లేకుండా కుర్చీలో కూర్చోవడం వల్ల వస్తాయని అపోలో హాస్పిటల్‌లోని న్యురాలజిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ సింఘాల్ తెలిపారు.
సరైన భంగిమలో కూర్చోకపోవడం, విరామాలు లేకుండా కూర్చోవడం, తరచూ పనిచేయడం, పనిచేసే చోట, ఇంట్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తి కూడా దీనికి కారణాలు. ఇలాంటి సమస్యలను టీచర్లు, జర్నలిస్టులు, రేడియో జాకీలు, దంతవైద్యనిపుణులు, నర్సులు, శస్త్రచికిత్స నిపుణులు, మసాజ్ చేసేవారు, పిల్లలు, గృహిణుల్లో ఈ వైద్యులు గుర్తించారు. ' అన్ని సంస్థలు పెద్దవి, చిన్నవి కూడా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అంటే కంప్యూటర్ లేదా టేబుల్‌కు వారి ఎత్తుకు సరిపోయేటట్లు కుర్చీ, టేబుల్‌ను అమర్చడం, కూర్చునే భంగిమను నిర్దేశించే శిక్షణ ఇవ్వడం. పని మధ్యలో విరామాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించడం చేయాలి' అని శరణ్ సూచించారు. 'ప్రతి 5 నిమిషాలకు ఐదు సెకన్లు, ప్రతి 30 నిమిషాలకు రెండు నిమిషాలు తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలని' తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more