ప్రముఖ చిట్ ఫండ్ అయిన మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పై, విజయవాడ బ్రాంచి మేనేజరు శ్రీనివాసరావు పై హషిత అనే బాధితురాలు ఫిర్యాదు మేరకు నమ్మక ద్రోహం, మోసం చేయడం వంటి నేరాల కింద కేసు నమోదు అయింది. సదరు మహిళా తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా ఆ స్థలం తాలూకు పత్రాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో పిటీషన్ వేసింది. దీని పై మేజిస్ట్రేట్ జయరాజు కేసు నమోదు చేయాలని మాచవరం పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే... 2009 జూన్ 17న కె.సుభాషిణి ఆస్తిని రూ. 57,50,000కు కొనుగోలు చేసింది. ఈ ఆస్తిని తాకట్టుపెట్టి మార్గదర్శి చిట్ ఫండ్ నుండి సుభాషిణి రూ. 29,95,000 రుణంగా పొందింది. ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండుదఫాలుగా రూ. 20 లక్షలు చెల్లించిన హషిత మిగతా రూ. 9,95,000లకు గ్యారెంటీగా విజయా బ్యాంకు పేరు మీద ఓ చెక్కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2009 మార్చి 28న మరో 3లక్షలు చెల్లించారు. మిగిలిన రూ. 6,95,000 మొత్తాన్ని చెల్లిస్తానని, తన స్థలం టైటిల్ డీడ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని చిట్ఫండ్ నిర్వాహకులను హషిత కోరింది. అయితే చిట్ ఫండ్ వారు మాత్రం ఇంకా 8 లక్షలు ఇస్తేనే డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పడంతో ఈమె సదరు కోర్టులో పిటీషన్ వేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more