Speaker to visit nalgonda today

Speaker to visit Nalgonda today,peaker Nadendla Manohar to visit Nalgonda district to help,Speaker to visit fluoride hit Nalgonda

Speaker to visit Nalgonda today

Speaker.gif

Posted: 07/07/2012 11:44 AM IST
Speaker to visit nalgonda today

Speaker to visit Nalgonda today

 స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాసనసభ్యుల బృందం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో పర్యటించడం మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. స్పీకర్ అంటే కేవలం శాసనసభకే పరిమితం అయ్యే ఉద్యోగంగా కాకుండా, విదేశీ యాత్రలకే స్పీకర్ పదవి పనికి వస్తుందన్న అభిప్రాయం కాకుండా జనంలో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడానికి , వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేయవచ్చని రుజువు చేయడానికి నాదెండ్ల మనోహర్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అని చెప్పాలి. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలలో ఒకటిగా ఉంది. అక్కడ వందల కొద్ది గ్రామాలలో ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు,కీళ్లు వంకరబోయి, ముందుగానే వృద్దాప్యానికి గురి అయిన బాధితులు ఎందరో ఉన్నారు. వారిని పలకరించడానికి స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వెళ్లడం హర్షనీయం.

 

Speaker to visit Nalgonda today

ఈ సందర్భంగా స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ ఈ సమస్యపై పరిశీలన చేసి ముఖ్యమంత్రి దృష్టికి సమస్య పరిష్కార మార్గాలను తీసుకువెళతామని అన్నారు.టిఆర్ఎస్ నాయకుడు కె.తారకరామారావు ఆద్వర్యంలో టిఆర్ఎస్ బృందం ఒకటి స్పీకర్ దీనిపై వినతి పత్రం కూడా సమర్పించింది. ఇక్కడి ప్రజలు కృష్ణా జలాల సరఫరా ద్వారా ఫ్లోరైడ్ బారీ నుంచి కాపాడాలని కోరుతున్నారు.ఇంతకుముందు మనోహర్ అరకు ప్రాంతానికి వెళ్లి మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి గిరిజన సమస్యలపై ఎమ్మెల్యేలలో అవగాహన పెంచడానికి యత్నించారు. ఇప్పుడు ఈ కృషి చేస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది వివాదం కాకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి , స్పీకర్ పదవిలో ఉన్నవారికి మద్య అంతరం పెంచడానికి ఆస్కారం ఉన్న విషయాలుగా వీటిని భావిస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కు పోటీ అన్న భావన రాకుండా జాగ్రత్తపడి , సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తే మనో హర్ ను మెచ్చుకోవలసిందే. ఫ్లోరోసిస్ అధ్యయనానికి జిల్లాకు వచ్చిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‑కు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం పెద్ద అడిశర్లపల్లి మండలం పుట్టంగండిలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యను తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra minister caught on wrong foot in temple
Will jagadish shettar be cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles