Whip jagga reddy criticizes jaipal and kk

Whip Jagga Reddy criticizes Jaipal and KK,Jaipal Reddy, CM Kiran kumar Reddy, Open fight, Gas allocations, Jagga Reddy, K.Keshava Rao, V. Hanumantha Rao, Delhi, Congress, High command

Whip Jagga Reddy criticizes Jaipal and KK

Jagga.gif

Posted: 08/13/2012 11:59 AM IST
Whip jagga reddy criticizes jaipal and kk

Whip Jagga Reddy criticizes Jaipal and KK

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యాఖ్యానించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావును పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు ఆయన ఏజెంట్‌గా పని చేస్తున్నారన్న విషయం రుజువైందని చెప్పారు. కేంద్రంలో 2004 నుంచి మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జైపాల్ రెడ్డి, కేకేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న కేకే కాంగ్రెస్‌లో ఉన్నారా.. లేరా? తెలంగాణ రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధం ఏంటి? పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఇస్తేనే రాజ్యసభ సీటు తీసుకుంటానని ఎందుకు మెలిక పెట్టలేదు? పార్టీని దెబ్బతీసేలా మాట్లాడుతున్న ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వాన్ని కూలదోయాలన్నందుకు బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. తెలంగాణపై అంత ప్రేమ ఉన్న కేకే.. తాను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిన రూ.30 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా కేశవరావు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణించాలని అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా.. 2004 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి రాష్ట్రం కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కేటాయింపుల విషయంలో ఆయనకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

Whip Jagga Reddy criticizes Jaipal and KK

రాష్ట్ర ప్రజలను ఏనాడూ పట్టించుకోని జైపాల్‌రెడ్డి.. కేంద్ర మంత్రి పదవికి అనర్హుడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇవ్వాలంటూ జైపాల్ రెడ్డి ఆన్ రికార్డుగా ఇంతవరకు చెప్పలేదని, తెలంగాణ వారి దగ్గర తెలంగాణ అని, సీమాంద్రుల దగ్గర సమైక్యాంధ్ర అంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కిరణ్‌ను దించేందుకు జైపాల్ రెడ్డి, కేకే కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణ పేరుతో సీఎం పదవి కోసం ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని సీఎం అవుతామంటూ ఎవరైనా ముందుకు వస్తారా? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New militant outfit in jak threatens girls against using mobiles
Complaints on obscenity nudity against tv channels  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles