I did not get any invite from sports ministry shastri

I did not get any invite from Sports Ministry: Shastri,Sports,Ravi Shastri,Rajiv Gandhi Khel Ratna, Baichung Bhutia,Arjuna Awards

I did not get any invite from Sports Ministry: Shastri

Shastri.gif

Posted: 08/21/2012 12:18 PM IST
I did not get any invite from sports ministry shastri

I did not get any invite from Sports Ministry: Shastri

రాజీవ్‌ గాంధి ఖేల్‌ రత్న, అర్జున అవార్డుల కమిటీ సమావేశానికి హాజ రు కాలేదంటూ తనపై వచ్చిన విమర్శను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రవిశాస్ర్తి తోసిపుచ్చారు. ఈ సమావేశం గురించి తనకు క్రీడల మంత్రిత్వశాఖ ఎప్పుడూ సమాచారం ఇవ్వనే లేదని రవిశాస్ర్తి స్పష్టం చేశారు. 15 మంది సభ్యుల అవార్డుల కమిటీలో శాస్ర్తి ఒకరు. న్యూఢిల్లీలో సమావేశమైన కమిటీ  అవార్డులను ప్రకటించిన విషయం విదితమే. ‘ఈ సమాచార సంబంధాల శకంలో నాకు సెల్‌ ఫోన్‌లో ఒక్క కాల్‌ లేదా ఒక్క ఎస్‌ఎంఎస్‌ లేదా ఈ మెయిల్‌ లేదా ఆహ్వానం ఎందుకు రాలేదు’ అని రవిశాస్ర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమిటీ సమా వేశానికి రవిశాస్ర్తి హాజరు కాకపోవడం పట్ల క్రీడల మంత్రిత్వశాఖ ఆగ్రహించిందం టూ వచ్చిన వార్తపై ఆయన పైవిధంగా స్పందించారు. గత కొన్ని రోజులలో రవి శాస్ర్తి ని సంప్రదించడానికి పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని క్రీడల మంత్రి త్వ శాఖ వర్గాలు చెప్పినట్లుగా  దినపత్రికలలో వార్త వచ్చింది. సమావేశానికి హాజరయ్యే అవకాశం కోల్పోవడం పట్ల రవిశాస్ర్తి బాధ వ్యక్తం చేస్తూ, ‘కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం గర్వకారణం. అయితే, మీడియా నుంచి ఈ వార్త వినరావడంలో అర్థం లేదు’ అని అన్నారు.‘ఈ సమాచార సంబంధాల యుగంలో ఎవ్వరూ నన్ను సంప్రదించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది’ అని రవిశాస్ర్తి పేర్కొన్నారు. సమయాభావంతో తాను పనిచేయవలసి వచ్చిందని క్రీడల మంత్రిత్వశాఖ అంగీకరించి నట్లు పత్రికా వార్తలు సూచించాయి. కమిటీకి నామినేట్‌ అయిన పది మంది ప్రముఖ క్రీడాకారులలో బైచుంగ్‌ భూటియా, రవి శాస్ర్తి మినహా మిగిలినవారందరూ సమావేశానికి హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar his family a must watch movies
Apple peel could stave off high blood pressure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles