ఆమె ఆంటీ... కానీ యువ వయసు అమ్మాయిల కంటే అందమైన ఆంటీ? ఆమె అందం చూసి, ఫిదా అయ్యాడు యువరాజు. యువరాజు అంతటివాడు ఏరీ కోరీ సరసం కోరుకుంటే .. ఎలాంటి అమ్మాయి మాత్రం కాదంటుంది చెప్పండి? ఆంటీ కూడా యువ రాజు స్పీడుకు చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. వారి మద్య ప్రేమ వికసించింది. ఆ ప్రేమ ముదురి హాట్ రొమాన్స్ తో తమలో వేడిని తగ్గించుకుంటున్న సమయంలో .. వీరి ప్రేమ వ్యవహరం ప్రపంచానికి తెలిసింది. అయితే దీనిపై ఆమె భర్త త్రీవంగా ఖండిస్తున్నారు. నా భార్య చాలా మంచిది. బిలావల్ భుట్టోకు, తన భార్య, విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్‌కు మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వచ్చిన వార్తలను ఆమె భర్త తీవ్రంగా ఖండించారు.పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టోకు, తన భార్య, విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్‌కు మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వచ్చిన వార్తలను ఆమె భర్త ఫిరోజ్ గుల్జార్ తీవ్రంగా ఖండించారు.
తన భార్య పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతోనే ఇలాంటి వదంతులతో దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఇలాంటి సోషల్ మీడియా గాసిప్‌పై తాను స్పందించబోనని ఆయన పేర్కొన్నట్టు జియో న్యూస్ చానల్ వెల్లడించింది.ఖర్‌తో భుట్టో ప్రేమాయణం సాగిస్తున్నారని, వారిద్దరూ ‘అత్యంత సన్నిహితంగా’ ఉండగా జర్దారీకి దొరికిపోయారని బంగ్లాదేశ్‌కు చెందిన ‘ది వీక్లీ బ్లిడ్జ్’ అనే టాబ్లాయిడ్ ఓ కథనం ప్రచురించింది. భర్తతో విడిపోయి, బిలావల్‌ను వివాహం చేసుకుని స్విట్జర్లాండ్‌లో స్థిరపడాలని కూడా ఖర్ యోచిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్, గుల్జార్ వివాహబంధంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తన భార్యపై అర్థంపర్థం లేని ఆరోపణలు గుప్పిస్తూ ఇంటర్నెట్‌లో కథనం వచ్చిన విషయం గురించి తన బంధువుల ద్వారా తెలిసిందని గుల్జార్ తెలిపారు. అయితే వాటిలో ఏముందో పూర్తి వివరాలు తనకు తెలియదన్నారు.భార్యతో విడిపోతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన వద్ద ప్రస్తావించగా.. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టంచేశారు. ఈ వదంతుల వెనుకనున్న వ్యక్తులు ఈ వ్యవహారంలోకి తన ఇద్దరు కుమార్తెలను కూడా లాగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వదంతుల సృష్టికర్తలను కనుక్కునే వ్యవస్థ పాకిస్థాన్‌లో లేకపోవడం విచారించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన రబ్బానీ కూడా ఇలాంటి గర్హనీయమైన అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని పేర్కొన్నట్టు జియో న్యూస్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more