Prajakta accuses gopichand of mental harassment

Prajakta sawant, pullela gopichand, national badminton, mumbai highcourt, prajaktha sawanth, training section, hyderabad, gopichand harassment, prajata shuttler, prajakta sawant to attend nationla camp, prajakta high court, badminton chief national coach, prajakta sawant

Prajakta accuses Gopichand of mental harassment

Prajakta.gif

Posted: 11/08/2012 01:52 PM IST
Prajakta accuses gopichand of mental harassment

Prajakta accuses Gopichand of mental harassment

భారత బ్యాడ్మింటన్‌లో తాజాగా మరో వివాదం... అది ఏకంగా చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రపైనే. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే గోపీచంద్‌పై మహారాష్ట్రకు చెందిన యువ క్రీడాకారిణి ప్రజక్తా సావంత్ కోర్టుకెక్కింది. గోపీ తనను వేధిస్తున్నారని, కెరీర్‌లో ఎదగకుండా కక్ష గట్టి అణగదొక్కుతున్నారని ఆమె ఆరోపించింది. జాతీయ జట్టు శిక్షణ శిబిరం నుంచి అన్యాయంగా బయటికి పంపించారంటూ ప్రజక్తా ముంబై హైకోర్టును ఆశ్రయించింది.విచారణ అనంతరం ఈ యువ క్రీడాకారిణిని శిక్షణ శిబిరానికి అనుమతించాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల ప్రజక్తా సావంత్ జాతీయ ర్యాంకింగ్స్‌లో డబుల్స్‌లో మూడో స్థానంలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె ఏడు పతకాలు కూడా నెగ్గింది. గత నెల 4న హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ జట్టు శిక్షణ శిబిరానికి కూడా ఆమె ఎంపికైంది. అయితే ఆటపై శ్రద్ధలేని ప్రజక్తా క్యాంప్‌కు రానవసరం లేదని... ఆమెపై క్రమశిక్షణ కమిటీ విచారణ కూడా చేస్తుందని గోపీచంద్ ఫోన్ చేసి చెప్పారు.

Prajakta accuses Gopichand of mental harassment

కేవలం తన డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ భాగస్వాములను మార్చమని కోరడమే దీనికి కారణమని ఆమె ఆవేదనగా చెప్పింది. ‘గోపీ మానసికంగా వేధించడం వల్లే సెప్టెంబర్‌లో అకాడమీ నుంచి బయటికి వచ్చాను. ఆయన ఎంపిక చేసిన బలహీనమైన భాగస్వాములతో కూడా నేను టోర్నీలు నెగ్గగలిగాను. వారిని మార్చమని అడగడం తప్పా! గోపీ తన స్వప్రయోజనాల కోసం తన అకాడమీకి, తన రాష్ట్రానికి చెందిన షట్లర్లను ఎంపిక చేస్తారు.ఎంతో మంది కెరీర్‌లను ఆయన నాశనం చేశారు. గోపీచంద్‌పై ప్రత్యేకంగా విచారణ కూడా జరిపించాలి. అప్పటి వరకు జట్లను పంపవద్దు’ అని తన పిటిషన్‌లో సావంత్ ఘాటుగా విమర్శలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు పూర్వాపరాలను విచారించింది. ఈ వివాదానికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులను కూడా ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ నితిన్ జమ్దార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజక్తాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను వెంటనే హైదరాబాద్‌లో జరిగే జాతీయ క్యాంప్‌లో చేరే అవకాశం కల్పించాలని ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Auto 6 crore illegal money case man surrenders
Dwarf befriends girl on facebook before cheating  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles