Rajapaksa visits tirumala

mahinda rajapaksa, dmk, tirupati, sri lanka, tamilnadu.

Sri Lankan President Mahinda Rajapaksa has completed his Tirumala visit. Tension prevailed in Tirupati, Andhra Pradesh where Sri Lankan President Mahinda Rajapaksa is scheduled to visit during his India tour starting from Friday, Feb 8.

rajapaksa visits tirumala.png

Posted: 02/09/2013 06:04 PM IST
Rajapaksa visits tirumala

rajapaksaశ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి నిన్న తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బస చేయడానికి టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాత్రి విశ్రాంతి తీసుకున్న ఆయన నేడు ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. 97 మంది ప్రతినిధులతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తన పర్యటన సందర్భంగా తమిళులు చేస్తున్న నిరసనలు, ఆందోళనల పై దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఎవరైనా నిరసనలు తెలిపే అధికారం ఉందని అన్నారు. కానీ తమిళులు తన పై చేస్తున్న ఆరోపణలు నిజం కాదని, అక్కడికి వచ్చి శ్రీలంక పరిస్థితులు చూస్తే వారికే అర్థం అవుతుందని అన్నారు.  రాజపక్స పర్యటన పై తమిళులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin suffers from stomach ache
Sharmila challenges tdp claim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles