Suicide bomb attack on reserve police linked to pak

pakistan terrorists, j k terrorist group, lashkar e taliban, indian central reserve police

suicide bomb attack on reserve police linked to pak

pak-terrorist-group.png

Posted: 03/15/2013 09:00 AM IST
Suicide bomb attack on reserve police linked to pak

 

attack-on-crp

బుధవారం జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు రిజర్వ్ పోలీసుల మరణానికి కారణమైన ఉగ్రవాద చర్యలతో సంబంధమున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను జమ్ము కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామ్ పురా ఛత్తాబాల్ ప్రాంతం నుంచి నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసామని పోలీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఆషిక్ బుఖారి తెలియజేసారు. దర్యాప్తు జరుగుతున్నందువలన ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని ఆయన అన్నారు.

 

tributes-to-jawans

ఆ ఉగ్రవాదుల దగ్గర లభించిన వస్తువులు ఇవి- రెండు డైరీలు, ఒక సిమ్ కార్డు (భారత్ ది), పాకిస్తాన్ ఉత్పాదనైన ఒక ఆయింట్ మెంట్ ట్యూబ్.

పాకిస్తాన్ చర్యే అనటానికి ఆధారాలు ఇవి- బారాముల్లా పల్హలాన్ గ్రామంలో కొన్ని వారాలుగా ఉంటూ ఒక కాశ్మీర్ ఉగ్రవాది గెరిల్లా పోరాటాల మీద నిఘా పెట్టి ఉంచటం, ఆత్మాహుతి దాడిని మొట్టమొదటిసారిగా తమదేనని ప్రకటించిన హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ, లష్కరే తాలిబాన్ వాళ్ళు ఈ ఘటన మీద మౌనంగా వహించటం, దొరికిన ఉగ్రవాదుల శవాలను తీసుకొవటానికి ఎవరూ ముందుకు రాకపోవటం, దొరికిన కొన్ని టెలిఫోన్ సంభాషణల ఆధారాలు, టెలిఫోన్ కాల్స్ వివరాలను పూసగుచ్చితే రిజర్వ్ పోలీస్ క్యాంప్ మీద జరిగిన దాడి కచ్చితంగా విదేశీయులదే నని అర్ధమౌతోంది. ఏతా వాతా అది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థైన లష్కరే తాలిబాన్, కాశ్మీర్ లోని ఉగ్రవాదులు కలిసి యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ మద్దతుతో చేసిన ఉగ్రవాద చర్య అన్నది ఇంతవరక జరిగిన దర్యాప్తు లో తేలింది.

ఈ ఉగ్రవాద సంస్థల కార్యక్రమంలో కాశ్మీర్ లోని పెద్ద హోటళ్లైన తాజ్, గ్రాండ్ మీద కూడా బాంబు దాడికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసి నిఘాపెట్టిన మూలకంగా ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో తమ మీద నిఘా పెట్టి న విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు తమ స్థలాన్ని మార్చటంతో రిజర్వ్ పోలీసు క్యాంప్ మీద దాడి విషయంలో సూచన అందక దాన్ని అరికట్టలేకపోయారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Half days for all schools under govt
India demands srilanka for an immediate release of fishermen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles