Minister chiranjeevi fall in water from boat at kakinada

chiranjeevi in water, flood affected areas, chiranjeevi survey on flood areas, chiranjeevi in kakinada, congress leaders fall in water, east godavari

Minister Chiranjeevi Fall in Water from Boat at Kakinada.

పరామర్శించడానికి వెళ్లి పడిపోయారు

Posted: 10/28/2013 07:13 PM IST
Minister chiranjeevi fall in water from boat at kakinada

‘తానకొకటి తలిస్తే... దైవం ఒకటి తలచినట్లు...’ ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతం అయిన తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు ధైర్యం చెప్పి, అక్కడి వారిని పరామర్శించడానికి కేంద్ర మంత్రి చిరంజీవికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈరోజు  తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన యలమంచిలి, కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం ప్రాంతం, ఆంజనేయ నగర ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించారు. అక్కడ జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంజనేయ నగర ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళేముందు బోటు ఎక్కబోయి జారి కిందపడిపోయారు.

ఈ పర్యటనలో చిరంజీవి వెంట కన్నబాబు, తోట నరసింహం కూడా ఉన్నారు. అయితే పరిమితికి మించిన జనాలు బోటు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆయనతో పాటు మరో ఆరుగురు కూడా కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు చిరంజీవిని లేపడంతో ప్రమాదం తప్పింది. తర్వాత చిరంజీవి అక్కడి బాధితులను పరామర్శి వచ్చారు. ఈ ఘటనలో చిరంజీవికి ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles