Kcr given bandh call on december 5th

kcr given bandh call on december 5th, TRS Furious, Calls For Bandh On Dec 5, KCR calls for bandh, rayala telangana,

kcr given bandh call on december 5th, TRS Furious, Calls For Bandh On Dec 5

బంద్ కు పిలుపు నిచ్చిన కేసిఆర్

Posted: 12/03/2013 09:12 PM IST
Kcr given bandh call on december 5th

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ తన పంజా విసురుతున్నాడు. కేంద్రం కొత్తగా రాయల తెలంగాణ పై చూపులు చూస్తున్న విషయం పై కేసిఆర్ మండిపడుతున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని కేసిఆర్ డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు పై వస్తున్న ప్రకటనలకు నిరసణగా టీఆర్ఎస్ వర్గాలు నిరసన కార్యక్రమాలకు తెర తీస్తోంది. ఎలాంటి అంక్షలు లేని తెలంగాణ కోసం డిసెంబర్ 5 తేదిన బంద్ కు పిలుపునిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలతోపాటు ఇతర సంస్థలు బంద్ కు సహకరించాలని ఆయన అన్నారు. ఇది తెలంగాణలో ప్రతి ఇంటికి సంబంధించిన విషయమని కేసీఆర్ వ్యాఖ్యాలు చేశారు.

 

రాయల తెలంగాణ ఏర్పాటుపై తమకు విశ్వసనీయమైన సమాచారం ఉంది అని.. అందుకే నిరసన తెలుపుతున్నామని కేసీఆర్ అన్నారు. రాయల తెలంగాణను ఎవరు అడిగారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు.

 

పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles