Iaf plane crashed near gwalior

IAF plane crashed near Gwalior, IAF C 130 J aircraft crashed, C 130 J IAF training mission, 5 dead in IAF aircrash

IAF plane crashed near Gwalior

వైమానికదళ విమాన ప్రమాదం 5 గురి మృతి

Posted: 03/28/2014 02:47 PM IST
Iaf plane crashed near gwalior

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సి 130 జె విమానం మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ప్రమాదానికి లోనైంది.  ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 

ఆగ్రా నుంచి ఉదయం పది గంటలకు శిక్షణా కార్యక్రమంలో బయలుదేరిన గ్వాలియర్ ఎయిర్ బేస్ కి 115 కిలోమీటర్ల దూరంలో పడిపోయిందని, ఈ ఘటన మీద దర్యాప్తు జరుగుతుందని వైమానిక దళ అధికార ప్రతినిధి అన్నారు.  

రాజస్తాన్, మధ్యప్రదేశ్ సరిహద్దులో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలియగానే జయ్ పూర్ పోలీసులు, కరౌలీ ఎస్పీతో సహా ప్రమాద స్థలానికి బయలుదేరారు. 

1.2 బిలయన్ డాలర్ల వ్యయంతో ఆరు  130 జె విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేసిన వైమానిక దళం మరో ఆరు విమానాలను కొనుగోలు చెయ్యటానికి ఆలోచిస్తోంది.  ఈ విమానాలను యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఇటలీ దేశాలు వాడుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles