General elections started today

polls in India, General elections started, Elections 2014, Elections in India, 16th Loksabha elections

general elections started, Elections 2014, Elections in India, 16th Loksabha elections

ఆరు చోట్ల సార్పత్రిక ఎన్నికల ప్రహసనం మొదలైంది

Posted: 04/07/2014 08:08 AM IST
General elections started today

దేశంలో 16 వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికల ప్రహసనం మొదలైంది.  దశలవారీగా 9 విడతల్లో దేశ పౌరులు 543 పార్లమెంట్ స్థానాలకు తమ నాయకులను ఎన్నుకోబోతున్నారు.  ఈరోజు అస్సాంలో 5 నియోజకవర్గాలలోను త్రిపురలో 1 నియోజకవర్గంలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 

ఈ నెలలో రెండవ దశలో 9 వ తేదీన, మూడవ దశలో 10 న, నాల్గవ దశలో 12న, ఐదవ దశలో 17న, ఆరవ దశలో 24న ఏడవ దశలో 30 న ఎన్నికలు జరుగనున్నాయి.  మే 7, 9 తేదీలలో చివరి ఎనిమిది తొమ్మిది దశల ఎన్నికల జరగబోతున్నాయి. 

వీటిలో ఏడు, ఎనిమిది దశల ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు.  ఈ ఎన్నికల తేదీల్లోనే లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 

ఒక లక్ష ముప్ఫై వేల పారా మిలిటరీ బలగాలు ఈ ఎన్నికలలో భద్రతకు సంబంధించిన విధులకోసం నియమించటం జరిగింది.  వాళ్ళు ఇప్పటికే హోంశాఖ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలలో (మన రాష్ట్రంలో ఖమ్మం, విశాఖపట్నం జిల్లాలు) గట్టి భద్రతను ఏర్పాటు చెయ్యటమే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా చూస్తారు.  అంతే కాకుండా దశలవారీగా జరుగుతున్న ఎన్నికలలో ఒకచోట ఎన్నికలు జరగగానే మరో చోటికి చేరుకుంటారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles