Fir on bjp leader amit shah for hate speech

FIR on BJP leader Amit Shah for hate speech, General Elections 2014, India polls 2014, Bharatiya janata pary, Congress party of India, Hate speech of Amit Shah

FIR on BJP leader Amit Shah for hate speech

భాజపా రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీద పోలీస్ కేసు

Posted: 04/07/2014 08:44 AM IST
Fir on bjp leader amit shah for hate speech

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర భాజపా జనరల్ సెక్రటరీ ఇన్ ఛార్జ్ అమిత్ షా మీద యుపి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 

పోయిన సంవత్సరం ముజప్ఫర్ నగర్ లో జరిగిన హింసాకాండను గుర్తుచేస్తూ, జాట్ ల మీద జరిగిన హత్యాకాండకు ఈ ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోమంటూ అమిత్ షా తన ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటంతో ఆయన పరిస్థితి రాజకీయంగా ప్రమాదంలో పడింది.  భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 153(ఏ) ప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు, సెక్షన్ 125 ప్రకారం రెండు మతాల మధ్య చిచ్చు రేపినందుకు అమిత్ షా మీద కేసు నమోదు చెయ్యటమైంది. 

భాజపా సహజంగానే తమ పార్టీ నాయకుడిని సమర్థించే ప్రయత్నంలో రాజకీయంగా లబ్ధి పొందటానికి సోనియా గాంధీయే మత విద్వేషాలను రగిలిస్తున్నారని, అందుకే ఆమె ఢిల్లీ జామా మస్జిద్ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారితో భేటీ అయ్యారని అన్నది.  అయితే, ఇది శుష్క వాదమంటూ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles