Pm manmohan singh farewell arrangements

PM Manmohan Singh Farewell arrangements, Prime Minister Manmohan Singh farewell, Sonia Gandhi farewell party to PM, PM shifting residence

PM Manmohan Singh Farewell arrangements

టాటా, వీడుకోలు, గుడ్ బై, ఇంక శలవు- ప్రధాని

Posted: 05/12/2014 10:41 AM IST
Pm manmohan singh farewell arrangements

ఢిల్లీలో 7, రేస్ కోర్స్ రోడ్డులో ప్రధాన మంత్రి నివాసం కొత్త మెరుగులు దిద్దుకుంటోందంటే అది కొత్త ప్రధాన మంత్రి కోసం.  పది సంవత్సారకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కొత్త ప్రధాన మంత్రి రాగానే తన అధికార నివాసాన్ని అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసమున్న 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్ కి మారిపోతారు.  అందుకు కావాలసిన ఏర్పాట్లను మన్మోహన్ సింగ్ సతీమణి గురు శరణ్ కౌర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.  ఇప్పటికే చాలా వరకు సామాన్లు తరలించటం జరిగిందని ప్రధాని మీడియా సలహాదారు పంకజ్ పచౌరీ తెలియజేసారు.  

రాబోయే ప్రధాన మంత్రి ఎవరైనా, అది మన్మోహన్ సింగ్ మాత్రం కచ్చితంగా కారు.  ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సరే తాను ప్రధాన మంత్రిగా కొనసాగనని ఆయన ముందుగానే తేల్చి చెప్పేసారు.  

అందువలన ప్రధానమంత్రి అధికారిక నివాసంలో కొత్త ప్రధానికి స్వాగతం పలకటానికి లాన్ల సుందరీకరణలోను, ఫర్నిచర్, కట్లరీలు మొదలైన వాటి సమీకరణలోను సిబ్బంది తలమునకలైవున్నారు.  

ఇక టాటా చెప్పటానికి మన్మోహన్ సింగ్ అన్ని ఏర్పాట్లనూ చేసుకుంటున్నారు.  వివిధ దేశాల ప్రధాన మంత్రులకు, అధ్యక్షులకు వీడ్కోలు లేఖలను రాసారు.  ఇంతకాలం కలిసి పనిచేసినందుకు చివరిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆయనకు వీడ్కోలు విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles