Malaysian airlines boing 777 crashes in ukraine russia border

malaysian airlines boing 777 Crashes, Malaysia Airlines Boing 777, nedrlands, malesia, malesia airlines, crash, 295 passengers.

malaysian airlines boing 777 Crashes In Ukraine Russia Border, Malaysia Airlines, still reeling from the mysterious loss of another Boeing 777 flight in March, confirmed that Ukrainian air traffic control lost , Malasian air liner crashes in Ukrain and 295 passengers feared dead,

మలేషియా విమానంపై మిస్సైల్ దెబ్బతో గాలిలోకలిసిన 295 ప్రాణాలు

Posted: 07/18/2014 08:47 AM IST
Malaysian airlines boing 777 crashes in ukraine russia border

ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ వెళ్తున్న విహంగం ఒక్కసారిగా కుప్పకూలింది. వందలాది ప్రయాణీకులు మాంసపు ముద్దలుగా మిగిలారు. గమ్యస్ధానానికి చేరుకోకుండానే విగత జీవులయ్యారు. మలేషియన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17 విమానం 295మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్‌కు వెళ్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాలకు ఆమ్‌స్టర్‌ డ్యాం నుంచి బయలు దేరిన విమానం కొంత సేపటి తర్వాత నిర్ధేశిత కక్ష్యనుంచి దారి తప్పింది.

అప్పటివరకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో సంబంధాలు నెరపిన ఎంహెచ్ 17 విమానం క్రమంగా సిగ్నల్‌ నుంచి దూరంగా జరిగింది. గతి తప్పిన విమానం ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులోకి ప్రవేశించగానే పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విమానం అగ్ని కీలల్లో చిక్కుకుని ఉక్రెయిన్‌లోని గ్రాబోవో అనే గ్రామంలో కూలిపోయింది..ఘటనాస్థలంలో మృతదేహాలు , పాసుపోర్టులు చెల్లచెదురుగా పడిఉన్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

malaysian-airlines-crash

తొలుత సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయి ఉంటుందని అందరూ భావించారు. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ ఇది ప్రమాదం కాదని తేలింది. ఉక్రెయిన్‌లో వేగంగా దూసుకొచ్చిన మిస్సైల్‌ మలేషియన్‌ ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 17 విమానాన్ని కూల్చేసిందని అధికారులు చెప్తున్నారు. అయితే అనుమతి లేకుండా గగనతలంలోకి దూసుకొచ్చినందుకే ఉక్రెయిన్‌ భద్రతా బలగాలు ఎంహెచ్ 17 విమానాన్ని మిస్సైల్‌తో పేల్చేసి ఉంటారని అనుకున్నారు. కానీ అంతలోనే తమ భద్రతా బలగాలు ఎలాంటి మిస్సైల్స్‌ను ప్రయోగించలేదనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పెట్రో ప్రోషెంకో ప్రకటన కొత్త ఆలోచనలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది.

Malaysian-plance-crash

మలేసియా విమానం అదృశ్యమైన ఘటన పూర్తిగా మర్చిపోక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం ఉక్రెయిన్ లో కూలిపోయింది. విమానంలో 295మంది ప్రయాణికులు 15 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం .అమ్ స్టర్ డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదంజరిగింది .

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles