Hyderabad corporators protest demolitions

Hyderabad corporators protest demolitions, BJP TDP corporators protest GHMC demolitions, 900 irregular constructions recognized by GHMC, 44 irregular constructions demolished by GHMC

Hyderabad corporators protest demolitions of GHMC

హైద్రాబాద్ లో కూల్చివేతలకు కార్పోరేటర్ల నిరసన

Posted: 07/18/2014 09:33 AM IST
Hyderabad corporators protest demolitions

హైద్రాబాద్ లో అక్రమ నిర్మాణాల మీద కన్నెర్ర చేసిన తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు 44 భవనాలు కూల్చివేసారు.  గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైద్రాబాద్ లో మొత్తం 900 అక్రమి నిర్మాణాలను గుర్తించింది.  కానీ గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేటర్లు ఆ కూల్చివేతలనింక నిలిపివేయాలని నిరసన గళాలనెత్తారు.  జిహెచ్ఎమ్ సి స్థాయీ సంఘం కూడా కూల్చివేతలకు నిరసన తెలియజేసింది. 

అక్రమ నిర్మాణాలంటూ ఏ ప్రాతిపదికను వాటిని గుర్తించారో తలియజేయకుండా కూల్చివేతలేమిటని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు జిహెచ్ఎమ్ సి ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా చేసారు.  పౌరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకుందని, ఇలా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని వాళ్ళు అన్నారు.  మేయర్ మాజిద్ హుస్సేన్ ని, సభ్యులను స్టాండింగ్ కమిటీ సమావేశానికి వెళ్ళకుండా ఘెరావ్ చేసారు.  

మేయర్ కార్పొరేటర్లకు నచ్చచెప్తూ, ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేస్తానని మాటిచ్చారు.  ఆ తర్వాత జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో హైద్రాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలను నిలిపివేయాలని నిర్ణయించారు.  ఈ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వానికి సిఫారసులు పంపించాలంటూ కోరగా, తాను ప్రభుత్వం ఆదేశాలనే పాటిస్తానన్నారు కమిషనర్.  స్టాండింగ్ కమిటీ తీర్మానం చెయ్యటం జరిగింది నిజమే కానీ కూల్చివేతల విషయంలో ప్రభుత్వ ఆదేశాలనే తాను పాటిస్తానన్న సంగతి సోమేశ్ కుమార్ మీడియా ప్రతినిధులకు కూడా స్పష్టంగా చెప్పారు.  
ఒకపక్క గురువారం చర్చలు, ఆందోళనలు జరుగుతూనేవున్నాయి, బాధితులు నిరసనలు చేస్తూనేవున్నారు, వాగ్వివాదాలు జరుగుతూనేవున్నాయి, మరోపక్క అదే రోజు 19 భవనాలను కూల్చటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles