Malaysia mh 17 plane crash hits stock market

malaysia MH 17 Plane crash, malaysia Plane crash hits Stock Market, malaysia MH 17 Plane crash hits Stock Market, Russian stock market hit, Boeing 777, flight MH17, malaysian airlines boing 777 Crashes, Malaysia Airlines Boing 777.

malaysia MH 17 Plane crash hits Stock Market, Malaysia Airlines plane crashes on Ukraine-Russia border, Russian stock market hit by new sanctions over Ukraine

మలేషియా విమాన విషాదం-మార్కెట్ల విలవిల..

Posted: 07/18/2014 09:28 AM IST
Malaysia mh 17 plane crash hits stock market

ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ వెళ్తున్న విహంగం ఒక్కసారిగా కుప్పకూలింది. వందలాది ప్రయాణీకులు మాంసపు ముద్దలుగా మిగిలారు. గమ్యస్ధానానికి చేరుకోకుండానే విగత జీవులయ్యారు. మలేషియన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17 విమానం 295మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్‌కు వెళ్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాలకు ఆమ్‌స్టర్‌ డ్యాం నుంచి బయలు దేరిన విమానం కొంత సేపటి తర్వాత నిర్ధేశిత కక్ష్యనుంచి దారి తప్పింది.

అయితే ఆ తరువాత ఉక్రెయిన్‌లో కూలిపోయిన మలేషియన్‌ ఎంహెచ్ 17 విమానం మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అంతే కాదు స్టాక్‌ మార్కెట్ల జోరుకు కళ్లెం వేసి షేర్‌ హోల్డర్లకు గట్టి షాక్‌ నిచ్చింది. దూసుకుపోతున్న అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌ కాస్తా ఉక్రెయిన్‌ విమానం ప్రమాదంతో నత్తను అనుసరించింది.

రష్యన్‌ వేర్పాటువాదులే ఉక్రెయిన్‌లో మలేషియన్‌ విమానాన్ని పేల్చేసారని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.ఇక ఉక్రెయిన్‌-రష్యా సంబంధాలు దెబ్బతిన్నట్లేనని గుప్పుమన్న వార్తలకు మార్కెట్లు కి రావటతో.. ఒక్కసారి మార్కట్ విలవిలాడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కుదేలైన షేర్లను ఓ సారి గమనిస్తే రష్యా ఈటీఎఫ్‌ 5.5 శాతానికి, మోర్గాన్ స్టాన్లీ 0.1 శాతం, యునైటెడ్‌ హెల్త్‌ 3.4 శాతం పడిపోయింది. ఇక పిహెచ్ఎల్ఎక్స్ కూడా నేలకు దిగిరాక తప్పలేదు. తర్వాతి నాలుగు క్వార్టర్లలో వీటి షేర్ల ధర భారీగా పడిపోయింది.

ఇటు నస్ధక్‌ కాంపోజిట్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే పరిస్ధితి.ఇక రానున్న 5,6రోజుల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పరిస్ధితులు ఉద్రిక్తంగా మారితే మార్కెట్లు విలవిలలాడిపోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles