Sonakhi buys world kabaddi league uk

sonakhi buys world kabaddi league uk, sonakshi likes adding glamour to sports, film tevar inspires sonakshi to like kabaddi

sonakshi likes adding glamour to sports

క్రీడలకు గ్లామర్ తోడైతే ? కబడ్డీలో సోనాక్షీ సిన్హా!

Posted: 07/18/2014 03:57 PM IST
Sonakhi buys world kabaddi league uk

కబడ్డీ గురించి చాలా మంది మాట్లాడారు దాన్ని ఒలింపిక్స్ లో గుర్తింపు వచ్చేట్టుగా చెయ్యాలని చాలా మంది అంటూ వచ్చారు.  ఎవరు ఎన్ని చెప్పినా కబడ్డీ గురించి ఒక సినిమా తార చెప్పటం వేరు కదూ.  దబంగ్ సినిమాతో పేరు తెచ్చుకుని తనకంటూ హిందీ సినిమాలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న సోనాక్షీ సిన్హా కబడ్డీకి గుర్తింపు రావాలని కోరుతోంది.  

ప్రపంచ కబడ్డీ లీగ్ యుకె ఫ్రాంచైజ్ కి యునైటెడ్ సింగ్స్ అనే పేరుతో హయరే గ్రూప్ తో సంయుక్త యాజమాన్యాన్ని వహిస్తున్నానని సోనాక్షి ప్రకటించింది.  తాను చిన్నప్పుడు ఫుట్ బాల్ టీం లో గోల్ కీపర్ గా భాగం వహించానని ఆమె గుర్తు కూడా చేసుకుంది.  అయితే తను కబడ్డీ మాత్రం ఆడలేదని, కానీ ఈ మధ్య నటించిన సినిమా తేవార్ లో అర్జున్ కపూర్ కబడ్డీ ఛాంపియన్ గా నటించటం చూసిన తర్వాత ఆ ఆటలో ఆసక్తి పెరిగిందని చెప్తోందామె.  

కబడ్డీ టీం కి యాజమాన్యం వహించినవారిలో అక్షయ్ కుమార్, యోయో హనీ సింగ్ కూడా ఉన్నారు.  

క్రీడలకు గ్లామర్ తొడైతే... అని అనగానే కొందరికి ఊహల్లో సోనాక్షీ సిన్హా అవతలి బృందంలో ఉన్నట్లు, ముందుగా తానే కూతకి పోయినట్లు, అక్కడ సోనాక్షీ అతగాడిని గట్టిగా పట్టుకుని గీత దాటి పోకుండా చేసినట్లు కనిపించేసిందట అప్పుడే.  పాయింట్ పోతే పోయిందిలే అంటున్నారు వాళ్ళు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles