Youngest groom at 9

youngest groom at 9 and eldest bride at 62, 9 years old weds 62 years old bride, Groom 53 years younger than bride, Strange couple in South African wedding

youngest groom at 9 weds eldest bride at 62

9 సం. వరుడు, 62 సం. వధువు- వింత పెళ్లి

Posted: 07/22/2014 12:10 PM IST
Youngest groom at 9

62 ఏళ్ళ వధువుతో 9 ఏళ్ళ బాలుడు వివాహం జరిగింది.  అందుకే వరుడు ప్రపంచంలోనే అతి చిన్న వరుడు కానీ వధువు మాత్రం అతి పెద్ద వయసులో పెళ్ళికూతురైంది.  ఆమెకిది మొదటి వివాహం కాదు, భర్త బ్రతికే ఉన్నాడు, పిల్లలూ ఉన్నారు.  వింతగా ఉంది కదూ.  ఇది పెద్దల సమక్షంలో అందరి సమ్మతితో జరిగిన పెళ్ళి.  ఇంకా వింతగా ఉందా.

ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని గ్జింగ్ హుంన్గ్వే లో జరిగింది.  పోయిన సంవత్సరం ఆ గ్రామానికి సమీపంలోని మరో గ్రామం త్షావేన్ కి చెందిన సనేలే మాసిలేలా అనే అబ్బాయి అప్పుడు 8 సంవత్సరాల వయసులో ఉండగా హెలెన్ షబాంగూ అనే 61 సంవత్సరాల వైవాహిత మహిళకు తాళి కట్టేసాడు.  ఎందుకూ అంటే వాళ్ళ పూర్వీకులు కల్లోకి వచ్చి ఆమెను పెళ్ళి చేసుకోమని చెప్పారట.  

పూర్వీకులు తనకి చెప్పిన విషయాన్ని అబ్బాయి వెల్లడి చెయ్యటంతో ఆ కుటుంబం దివంగతులైన పెద్దల మాటను తోసిపుచ్చలేక వెంటనే 61 సంవత్సరాల వధువుకి 500 డాలర్లను కానుకగా పంపుతూ మరో 1000 డాలర్లతో ఆ శుభకార్యం కాస్తా కానిచ్చారు.  సనేలే అనే ఆ అబ్బాయి ఆ కుటుంబంలో 5 గురు సంతానంలో అందరిలోకీ చిన్నవాడు.  అయితే ఈ వివాహ వేడుక జరిగినా సనేలే అంతటితో తృప్తిపడలేదు.  అక్కడి ఆచారం ప్రకారం మరోసారి వివాహమాడితేనే ఆ తంతు పూర్తయినట్లు కాబట్టి, అధికారకంగా పెళ్ళయినట్లు కాదు కాబట్టి, దానికోసం పట్టుపట్టాడట.   

   

చేసేది లేక ఈ సంవత్సరం ఆచారం ప్రకారం రెండవసారి బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా రెండవ పెళ్ళి తంతు కూడా పూర్తైపోయింది.  గ్రామవాసులంతా ముక్కున వేలేసుకుంటే, ఇది కేవలం తంతు మాత్రమే నంటూ అబ్బాయి కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు.  కానీ అక్కడ పెళ్ళి వాతావరణం చూస్తే అలా లేదు.  వెడ్డింగ్ గౌన్ లో పెళ్ళి కూతురులా ఆమె తయారైంది, బుడ్డి పెళ్ళి కొడుకూ సూట్ లో మెరిసిపోతున్నాడు, 100 మంది సమక్షంలో వివాహ మహోత్సవం జరిగింది, పెళ్ళవగానే ఇద్దరూ గట్టిగా బిగి కౌగిలిలో ముద్దులాడుకున్నారు, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.  

66 సంవత్సరాల ఆమె భర్త ఆల్ఫ్రెడ్ షంబంగు పక్కనే ఉండి ఈ వేడుకలను తిలకిస్తున్నాడు.  పెళ్ళవగానే ముద్దు పెట్టుకునే ఆచారాన్ని పెళ్ళికూతురు ఒక చేతిని పాత భర్త భుజం మీద వేసి మరీ పూర్తి చేసింది.  ఎవరేమనుకున్నా తనకు బాధలేదని,  ఈ  పెళ్ళి మీద తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆల్ఫ్రెడ్ అన్నాడు.  


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/youngestgroom

బుజ్జి పెళ్ళి కొడుకు 47 సంవత్సరాల వయసులో ఉన్న తల్లి తన కొడుకు కోరుకున్నట్లుగా జరిగిందని, అబ్బాయి సంతోషంగా ఉన్నాడని అంటోంది.  పోయిన సంవత్సరం మొదటి వివాహం జరిగినప్పుడు సిగ్గుపడటం లాంటివేమీ అబ్బాయి చెయ్యలేదట.  చాలా ఆనందంగా ఉన్నాడట.  ఆ తర్వాత కూడా, ఇద్దరం కలిసివుండచ్చా, సంసారం చెయ్యవచ్చా, పిల్లలను కనవచ్చా అన్న ప్రశ్నలను కూడా తల్లిని అడుగుతూ వుండేవాడట.  అదేమీ ఉండదు, పెళ్ళి తర్వాత కూడా అంతా ఇప్పడున్నట్లే ఉంటుందని ఆమె చెప్తుండేదట.  

ఈ పెళ్ళితో తనకు చాలా ఆనందంగా ఉందని అన్న పెళ్ళి కొడుకు పెద్దయిన తర్వాత తన ఈడు పిల్లను పెళ్ళి చేసుకుంటానని అంటున్నాడు.  అంటే తంతు పూర్తి చేసినా తల్లి ఆ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్తూనేవచ్చిందన్నమాట.  కాకపోతే పైలోకాల్లో ఉన్న పూర్వీకుల మనసు కష్టపెట్టటం ఇష్టం లేకనే ఆమె ఈ తంతుని పూర్తి చేయించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles