Governor esl narasimhan stepping out

AP Telangana Governro ESL Narasimhan, Governor Narasimhan stepping out, Governor Narasimhan leaving, Former Supreme Court Judge Sathasivan, Former Judge Sathasivan AP Telangana Governor, Common policing in Hyderabad

Governor ESL Narasimhan stepping out to welcome Supreme Court Judge coming in Governor

గుడ్ బై చెప్పబోతున్న గవర్నర్ నరసింహన్?

Posted: 07/26/2014 06:15 PM IST
Governor esl narasimhan stepping out

రాష్ట్ర విభజన కాకముందు నుంచి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గాను, ఆ తర్వాత ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గాను వ్యవహరించిన ఇఎస్ఎల్ నరసింహన్ తప్పుకోబోతున్నారన్న వార్త ప్రముఖంగా వినిపిస్తోంది.  దానితో పాటే ఆ స్థానంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం గవర్నర్ గా రాబోతున్నారన్నది కూడా వినిపిస్తోంది.

ఇది ఒకందుకు మంచిదేనేమో.  ఉమ్మడి రాష్ట్రంలో గొడవలు లేని సందర్భంలో అత్తలేని కోడలుత్తమురాలు అన్నట్లుగా ఉన్న నరసింహన్, రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వస్తున్న తగాదాలతో నలిగిపోతున్నట్లుగాను ఎటూ తేల్చలేకుండానూ ఉన్నారు.  వివాదరహితంగా ఉండటమే కాదు కదా అవసరమైనప్పుడు అధికారాన్ని ఉపయోగించేట్టుగా కూడా ఉండాలి.  రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు కూడా పెద్దగా నిర్ణయాలు తీసుకుని కట్టడి చేసిన సందర్భాలేమీ లేవు.  

పైగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్.  మోదీ ప్రభుత్వం రాగానే ఇతర గవర్నర్లతో పాటు ఆయనూ పంపించేస్తారేమో అనుకుంటే ఆయనకు రెండు రాష్ట్రాల బాధ్యతను అప్పగించటం జరిగింది.  కానీ ఆయన ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా నెట్టుకురావటం చేస్తున్నారే కానీ ఏ సమస్యనూ పరిష్కరించిన దాఖలాలు లేవు.  రేప్పొద్దున్న ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్ దే అని కేంద్రం గట్టిగా చెప్పిన పరిస్థితిలో ఆయన గట్టిగా నిలబడతారన్న నమ్మకం తక్కువగానే కనిపిస్తోంది.

మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి గవర్నర్ పదవిలోకి వస్తే ఉమ్మడి రాజధాని శాంతి భద్రతలతో పాటు రాజ్యాంగపరమైన, న్యాయపరమైన తగాదాలను సమర్ధవంతంగా పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని కలిగించుకోవచ్చు.  

అయితే ఇంకా ఈ వార్తలు అందుతున్న సమాచారంతో చెప్పుకుంటున్న వార్తలే కానీ రూఢి అయిన వార్తలు కావింకా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles