Cm kcr fires on times of india news paper

cm kcr fires on news papers, cm kcr latest news, cm kcr latest press meet, cm kcr warns times of india daily, cm kcr times of india daily, times of india daily papers, cm kcr fires on news papers, cm kcr warns news papers, cm kcr comments on times of news paper, cm kcr warning leaders, cm kcr meeting

cm kcr fires on news papers : Cm Kcr giving warning to all news papers which creates sensation news on government

కోపంతో పత్రికల్ని చించేస్తున్న కేసీఆర్!

Posted: 08/01/2014 04:11 PM IST
Cm kcr fires on times of india news paper

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మొన్న టీవీ9, ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెళ్ల మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఆయన వార్తాపత్రికలను హెచ్చరిస్తూ ఒక ప్రకటనను జారీ చేశారు. ‘‘సెన్సేషనల్ కోసం వార్తలు రాసే పత్రికల సంగతి చూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. వార్తాపత్రికలు అన్నాక ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందించాలేగానీ... తమ పత్రికలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఎలాపడితే అలా సెన్సేషనల్ వార్తలు రాస్తే ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు.

శుక్రవారం హైటెక్స్ సిటీలో జరిగిన రెవెన్యూ సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ వార్తాపత్రికలకు పై విధంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి వార్తలను రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని, సెన్సేషన్ కోసం వార్తలు రాస్తే తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు. అలాగే... కొన్ని మీడియా సంస్థలు తమకు ఇష్టమొచ్చినట్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయని... వాటి సంగతి కూడా త్వరలోనే తేల్చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తూ మండిపడ్డారు. ప్రస్తుతం పత్రికలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ప్రభుత్వం తరఫున ఒక పత్రికను స్థాపించే ఆలోచన వుందని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగానే ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అయిన ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’ వార్తాపత్రికపై విరుచుకుపడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా ఆ పత్రిక ఆయన మీద నింద వేసిందని ఆయన తెలిపారు. ‘‘ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అధికారాలన్నింటినీ కేసీఆర్ లాక్కున్నారని, బడ్జెట్ విషయాలను కూడా తానే నిర్ణయిస్తున్నానంటూ వార్తలు రాశారని.. ఈ వివరాల గురించి వారికి ఎలా తెలిశాయి..? ఎవరు చెప్పారు..? అని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆ పత్రిక నుంచి తాను వివరణను డిమాండ్ చేస్తారని చెప్పారు. ఇంతగా మండిపడిన ఆయన చివరగా ‘‘మీడియాకు తాను వార్నింగ్ ఇవ్వడం లేదని.. ఎటువంటి సమాచారాలు లేకుండా వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలోనే తాను ఇలా మాట్లాడుతున్నానని’’ క్లారిటీ ఇచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles