అహంకారం మనిషి జీవితాన్ని, ప్రాంతం పరువు తీస్తాయని .. నిన్నజరిగిన రాజ్యసభలో రుజువైంది. ‘‘మనిషి ఎదిగిన కొద్ది.. ఒదిగి ఉండాలని’’ మన పెద్దలు చెబుతుంటారు. కానీ కొంతమంది అవి పట్టించుకోకుండా.. మొండివైఖరితో.. ముందుకు సాగిపోయి.. నలుగురిలో నవ్వులపాలవుతారు. ఇదే పరిస్థితి తెలంగాణ నేతలకు రాజ్యసభలో జరిగింది. ఏదో మీడియా ముందు నాలుగు మాటలు మాట్లాడి.. బుల్లితెరపై తన ముఖం చూసుకొని ఆనందపడే నేతలు రోజు రోజుకి తయారవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నీతి, నిజాయితీగా, న్యాయంగా మాట్లాడే నేతలు కరవైయ్యారనేది సత్యం.
కిందపడిన పై చెయి మాదే అనే వారికి ఏదోఒక రోజు బలమైన దెబ్బ తగులుతుంది. అలాగే కొత్త రాష్ట్రం, కొత్త అధికారం, కొత్త నేతలు, ప్రజలకు న్యాయం చేయాల్సిన వారే, పబ్లిక్ కు, ప్రజా నేతలకు మేలు చేసే మీడియా పై ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో.. రాజ్యసభలో కళ్ల కు కట్టినట్లు చూపించారు. ఆయా మీడియా మైకుల ముందు నిలబడి.. రాజకీయ ప్రకటనలు చేస్తారు? అదే మీడియాలో పర్సనల్ చర్చలు జరుపుతారు, అవసరమైతే అదే మీడియాలో వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇస్తారు.. మళ్లీ అదే మీడియా ఛానల్స్ ను బ్యాన్ చేస్తారు. ఇదేక్కడి న్యాయం అని అడిగినందుకు మేము తప్పు చేయలేదు.. అవసరమైతే .. ఉరేసుకుంటానని రాజ్యసభలోనే సవాల్ చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోల పరిస్థితి ఇప్పుడు ఘోరంగా మారిపోయింది. నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి సపోర్టు ఉన్న వారు.. ఈరోజు ఏ సపోర్టు లేని అనాథుళ్ల మారిపోయారు. సర్కార్ అండతో.. మీడియా ఛానల్స్ నిలిపివేస్తే, కేంద్రం కన్నెర్ర చేయటంతో.. ఎంఎస్ వోలు ..గడగడలాడే పరిస్థితి వచ్చింది. కేంద్రం దెబ్బకు ..రాష్ట్ర సర్కార్ సైలెంట్ గా, మాకు ఈ మీడియా ఛానల్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఒక లేఖ రాసేసి.. పక్కకు తప్పుకుంది. ఇప్పుడు అందరి దృష్టిలో .. దోషులుగా నిలబడింది కేవలం తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోలు.
ఇప్పుడు వీరి పరిస్థితి ..‘‘ముందుకు పోతే నుయ్యి.. వెనక్కి చూస్తే గొయ్యి’’ మాదిరిగా ఉంది. ఎంఎస్ వోలు బతుకుతుందే.. మీడియా ఛానల్స్ మీద!! అలాంటిది అన్నం పెట్టి వారిపై కాలు దువ్వితే పరిస్థితి ఇలాగే ఉంటుందని రాజ్యసభ సాక్షిగా అర్థమైంది. అసలు మీడియా ఛానల్స్ లేనప్పుడు.. మీకు మీడియా వ్యాపార లెసైన్స్ ఎందుకు? ఎవరైన అడిగితే ఏం సమాధానం చెబుతారు ఒక్కసారి ఆలోచించండి? ‘‘నీడనిచ్చే చెట్టును , అన్నం పెట్టే అమ్మను, ఆదరించే సంస్థను’’ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు. ఇదేదో ఆ మీడియా ఛానల్స్ పై అభిమానంతో రాయటంలేదు.!! మీడియా వారు తప్పు చేసాం ..క్షమించండని పబ్లిక్ గా చెప్పటం జరిగింది. ఇంతకీ కంటే భయంకరమైన తప్పులు చేసిన రాజకీయ నేతలు సారీ చెబితే.. సర్థుకుపోయాం.!! ఆ రెండు ఛానల్స్ సారీ చెబితే.. క్షమించే గుణం మనలో ఎందుకు లేదని తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోలు అంతర్మథనం పడుతున్నట్లు సమాచారం.
ఏ మీడియా ఛానల్స్ చూసిన ఏమున్నది గర్వకారణం... ‘‘మూడు కామెంట్లు.. ఆరు బూతు పదాలు’’. అవే ఇప్పుడు టెక్నాలజీతో పోటీ పడుతున్నాయి. విమర్శలను విచిత్రంగా చూపించిన మీడియా లేదు.. అలాగే బూతు పలకని మీడియా వారు ఎవరైన ఉన్నారా? చెప్పండి..!! బూతు పదాలు మనకు ఉతపదాలు అని మన ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో అనేక సార్లు చెప్పటం జరిగింది.
అయినా మూడు నెలలుగా ఆ మీడియా ప్రసారాలు బంద్ చేస్తే .. తెలంగాణ రాష్ట్రానికి, ఎంఎస్ వోలకు వచ్చిన లాభం ఎంత? ఒక్కసారి బేరీజు వేసుకుంటే... ఎప్పుడు లేని విమర్శలు, కొత్తగా వచ్చిన తలనొప్పి!! తప్పితే. ఏమీ రాలేదని అందరికి తెలుసు.
ఏదో బడాయికి పోయి.. తాము హద్దులు దాటుతున్నమన్న ఆలోచన లేకుండా, అహంకారంతో అడుగులు వేసినందుకు ఎంఎస్ వోలకు తగిన శాస్తి జరిగిందన్న విమర్శలు .. మీడియా అభిమానుల నుండి వినిపిస్తున్నాయి. రాజ్య సభలో లో తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోలు చేసిన తప్పు ఏమిటో ..దేశం మొత్తం చూసింది. దీంతో అన్ని రాష్ట్రాల నేతలు, ఎంఎస్ వోలు ..తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోల వైఖరిపై మండిపడుతున్నారు. ‘‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇలా జరుగుతుందని ’’ కేంద్రంలోనే రాజకీయ నేతలు అంటున్నారు.
అయినా.. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఎటువైపు వెళ్లిన..తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోలకు దారులు కనిపించటంలేదు.!! ఒకవేళ తెలంగాణ సర్కార్ సపోర్టు ఇస్తుందా అంటే.. అదీ కూడా లేదని ఈ పాటికే అందరికి అర్థమైంది. ఇప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ వోలు కేంద్రం కాళ్లు, గడ్డలు పట్టుకొని.. బతిమాలాడుకోవాల్సి పరిస్థితి వచ్చిందని కొంతమంది సీనియర్ ఎంఎస్ వోలు అంటున్నారు. ఉడుకు రక్తం యువకులతో చేతులు కలిపితే.. ఇలాగే పరువు పోతుందని ఇతర రాష్ట్రాల ఎంఎస్ వోలు అంటున్నారు.
ఏమైన.. రాజకీయ నేతల మాటలు నమ్మోకొంటే.. మన నడ్డి విరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more