Murder charges on pak pm nawaz sharif

nawaz sharif, pak pm, pakisthan, pakisthan news, murder charges on nawaz sharif, musharraf, pakisthan army, latest news, nawaz sharif india tour, latest world news

pak court ordered to file murder chages on pm nawaz sharif : nawaz sharif and 19 others to face murder charges for voilence on june

పాక్ ప్రధాని కుటుంబంపై మర్డర్ కేసు !

Posted: 08/17/2014 09:21 AM IST
Murder charges on pak pm nawaz sharif

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు కోర్టు కష్టమొచ్చింది. షరీఫ్ పై హత్య కేసు అభియోగాలు నమోదు చేయాలని ఆదేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానితో పాటు పాక్ లోని పంజాబ్ రాష్ర్ట ముఖ్యమంత్రి, షరీఫ్ సోదరుడు షాబాజ్ పై కూడా హత్య అభియోగాలతో కేసు నమోదు చేయాలని లాహోర్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు షరీఫ్ అల్లుడు హమ్జా షాబాజ్ పై కూడా కేసు నమోదు చేయమని స్పష్టం చేసింది. దీంతో ఫ్యామిలీ అంతా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. అటు న్యాయస్థాన ఆదేశాలతో ఆమాత్యులపై కేసులు పెట్టేందుకు పాకిస్థాన్ పోలిసులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, పాలనా విధానాలపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో.., తాజాగా ఈ కేసు వీరికి కొత్త తలనొప్పిగా మారనుంది.

ఈ కేసు వివరాలు చూస్తే.., జూన్ నెలలో మతాధికారి తెహ్రుల్ ఖాద్రికి చెందిన హెడ్ క్వార్టర్ లో అల్లర్లు జరిగాయి. ఈ ఘర్షణలో 14మంది చనిపోయారు. దీనికి సంబంధించి వీరిపై ఆరోపణలు వచ్చాయి. 14మంది మృతికి షరీఫ్ కుటుంబం, అనుచరులే కారణమని కోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ మేరకు స్పందించిన కోర్టు., మొత్తం 21మందిపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే ఏక సభ్య కమిషన్ విచారణ జరిపి అల్లర్లకు స్థానిక ప్రభుత్వానిదే బాద్యతగా నివేదిక ఇచ్చింది. అయితే ఈ కమిషన్ ను ఖాద్రీ తిరస్కరించారు. ఘర్షణపై స్వతంత్ర్య విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అటు హత్య కేసు నమోదు చేయాలన్న సెషన్స్ కోర్టు ఆదేశాలను లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

మెరుగైన పాలన అందించటంలో షరీఫ్ ప్రభుత్వం విఫలమయిందని పీటీఐ ఇమ్రాన్ ఖాన్ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేయనుంది. మరోవైపు ఇమ్రాన్ ఆజాద్ ర్యాలిలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. త్వరలో దీని ఉచ్చు కూడా షరీఫ్ కాళ్ళకు పట్టుకోనుంది. మరి ఈ చిక్కులను వదిలించుకుని పాక్ ప్రధాని ఎలా బయట పడతారో వేచి చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nawaz sharif  murder charges  pakisthan news  lahore court  

Other Articles