Jagan criticise chandrababu naidu in assembly

jagan mohan reddy, ys rajashekar reddy, sharmila, vijayamma, ys family, jagan case, ysr congress, elections, latest news, politics, chandrababu naidu, tdp, ap ministers, ap assembly

ys jagan critises chandrababu programmes schemes of his term : babu government projects are not fruit ful but ys schemes are so says jagan

బాబు పొలంలో మొలకలు రాలేదు

Posted: 08/25/2014 12:42 PM IST
Jagan criticise chandrababu naidu in assembly

అసెంబ్లి సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చకు తప్ప ప్రతి అంశానికి ఉపయోగపడతాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవాలన్నా.., రాజకీయ పార్టీలు అవినీతి, అక్రమాలపై తిట్టుకోవాలన్నా అసెంబ్లీ సభే సరైన వేదిక. ఇంతేకాదు పార్టీలపై సెటైర్లకు, చివరకు జోకులకు కూడా అసెంబ్లీనే వేదికగా మార్చుకుంటున్నారు మన నేతలు. ఐదు రోజుల పాటు రాజకీయ హత్యలపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలా అని ప్రజా సమస్యలపై కూలంకుషంగా చర్చ జరుగుతోంది అనుకుంటే పొరపాటే. సభలో ఆగ్రహావేశాలు తగ్గాయి తప్ప.., విమర్శలు కాదు.

ఇన్ని రోజులు వాడి వేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు సెటైర్లకు మారాయి. ఉన్న రెండు పార్టీలు ఢీ: అంటే ఢీ: అన్నట్లు విమర్శల్లో పోటి పడుతున్నాయి. సినిమా డైలాగులతో సెటైర్లు వేసుకోవటంలో కూడా ముందుంటున్నాయి. ‘‘అందరి పొలంలో మొలకలొచ్చాయి కాని... ’’ ఇది సిద్ధార్ధ్ నటించిన ఓ సినిమా డైలాగ్. ఇదే డైలాగ్ తో అసెంబ్లీలో టిడిపికి వైపీపీ చురకలు అంటించింది.  తాను వేసిన విత్తనాలన్ని వైఎస్ హయాంలో మొలకెత్తాయని  ఈ మద్య చంద్రబాబు అన్నారు. తన పధకాలనే వైఎస్ అమలు చేశారు.. తప్ప కొత్తగా పెద్దగా చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

ఈ మాటలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. బాబు గారు 9 సంవత్సరాలు వరసపెట్టి విత్తనాలు వేస్తున్నా మొలకలు రాలేదన్నారు.  అయితే రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే వేసిన విత్తనాలు మాత్రం మొలకెత్తాయన్నారు. బాబు పొలంలో విత్తనాలు ఎందుకు మొలకెత్తలేదో అందరికీ తెలుసు అని  సెటైర్లు విసిరారు. వెంటనే బాబు హయాం అంతా కరువే కదా అంటూ వైసీపీ సభ్యులు బల్లలు చరుచుకున్నారు. ఇదీ మన సభ తీరు. రెవిన్యూ లోటులో ఉన్న రాష్ర్టానికి ప్రతినిధులుగా ఉన్న నేతలు.., రాష్ర్టాన్ని ఎలా గట్టెక్కించాలి అని చర్చించకుండా, నువ్వు దొంగ.., నువ్వు కేడి అని విమర్శలు చేసుకోవటానికి పరిమితం అవుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  chandrababu naidu  ysr  latest news  

Other Articles