టీడీపీ, వైకాపా పార్టీల మధ్య అస్సలు సఖ్యత కుదరదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ రెండు పార్టీలు ఎప్పుడూ ప్రసంగాలు నిర్వహించినా.. అందులో ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడం ఖాయం! అలా చేయకపోతే వారి నోటి నుంచి మాట కూడా రాదనుకోండి... అంతగా తిట్టిపోసుకుంటుంటారు. ఇక రాష్ట్ర విభజన నుంచి అయితే వీరిమధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ టీడీపీవాళ్లు మొత్తుకుంటుంటే... లేదు దీనికి కారణం టీడీపీ పార్టీయేనంటూ వైకాపా నేతలు ఆరోపణలు చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్ బడ్టెజ్, హత్యారాజకీయాల మీద ఏపీ అసెంబ్లీలో గత వారంరోజుల నుంచి సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో ఈ రెండు పార్టీల నాయకులు దారుణంగా తిట్టిపోసేసుకున్నారు. టీడీపీ పార్టీ నాయకులు వేసిన ఆరోపణలకు జగన్ అప్పుడప్పుడు చురకలంటించుకుంటూ అప్పుడప్పుడు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సోమవారంనాడు టీడీపీ అభ్యర్థులు చెప్పిన కొన్ని మాటలకు ఆయన ఘాటుగానే సమాధానాలు చెప్పారు. అభివృద్ధి విషయంలో కొన్ని సూచనలు చెబుతూ.. ‘‘ట్యూషన్ చెబుతున్నానయ్యా.. నేర్చుకోండి’’! అంటూ చుకలు అంటించారు.
ఇందులో భాగంగానే జగన్ మాట్లాడుతూ.. ‘‘గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులు బాగానే చేపట్టింది. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి బ్రహ్మండంగానే వుంది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం గవర్నర్ ప్రసంగం నుంచి బడ్జెట్ ప్రసంగం దాకా ప్రతిచోటా గత ప్రభుత్వాల్ని ఆడిపోసుకుంటోంది. వారి మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తోంది’’ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. బడ్జెట్ మీద అసెంబ్లీలో చర్చ ప్రారంభమైన క్రమంలో జగన్ ప్రసంగిస్తూ.. ‘‘గడిచిన పదేళ్లలో చాలా అన్యాయం జరిగిపోయిందని... అంతకుముందు టీడీపీ ఎంతో అద్భుతంగా పాలించిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప... చేసింది ఏమిలేదు’’ అని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే.. ‘‘తామిచ్చిన హామీలను టీడీపీ వాళ్లు నెరవేర్చలేక 20 ఏళ్ల క్రిందకు వెళ్లి అప్పుడు తామేమో బాగా పరిపాలించామని.. ఆ తర్వాత సర్వనాశనమైపోయిందని చెప్పుకుంటున్నారు. హామీలను నెరవేర్చడం చేతగాకే గత ప్రభుత్వాల మీద నేరం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ‘‘ఆడలేక మద్దెల ఓడు’’ అనే సామెత నాకు గుర్తుకు వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం పరనిందా ఎక్కువగా చేస్తోంది’’ అని జగన్ వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఈయన ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు.. ‘‘మీ నుంచి మేం నేర్చుకోవాల్సిన పని లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయాలో మాకు తెలుసు’’ అని చెప్పడంతో.. ‘‘ట్యూషన్ చెబుతున్నానయ్యా.. నేర్చుకోండి’’ అంటూ చురకలు అంటించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more