Gold seized in chennai airport

gold, gold biscuit 24 carat, gold rates, gold smuggling, chennai, chennai airport, airports, hyderabad airport, customs, central exise, central departments, security, latest news, flight journey, flight ticket booking, biscuits, chocolates, malaysia

2kgs gold seized in chennai airport by customs officials : gold biscuits smugged in chocolates customs in chennai airport seized 2kgs of gold

చాక్లెట్లలో బిస్కెట్లు. సీజ్ చేసిన కస్టమ్స్

Posted: 09/03/2014 10:40 AM IST
Gold seized in chennai airport

అక్రమంగా బంగారం తరలించేందుకు స్మగ్లర్లు నానా తంటాలు పడుతున్నారు. దొంగ బంగారం రవాణా కోసం రోజుకో కొత్త మార్గం అన్వేషిస్తున్నారు. అయితే వారి ఎత్తులన్నీ విమానాశ్రయాల్లో చిత్తవుతున్నాయి. ఇన్నాళ్లు చెప్పుల్లో.. బట్టల్లో.., సూటుకేసుల్లో సీక్రెట్గా బంగారం తరలించారు. చివరకు ఇప్పుడు చాక్లెట్లలో కూడా బంగారం బిస్కట్లు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైలో ఇలా తరలిస్తున్న రెండు కేజిల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం అర్ధరాత్రి కౌలాలంపూర్ నుంచి మలేషియా ఎయిరలైన్స్ విమానం చెన్నైకి వచ్చింది. ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు రాయపేటకు చెందిన అరాఫత్ అనే యువకుడిని కూడా తనిఖీ చేశారు. అనుమానంగా ప్రవర్తించటంతో బ్యాగులోని అణువణువూ గాలించారు. చివరకు చాక్లెట్లను పరిశీలించగా.., అందులో బంగారం బిస్కెట్లు ముక్కలుగా కత్తిరించి దాచి ఉంచటాన్ని గుర్తించారు. అలా చాక్లెట్లలో దాచిన సుమారు రెండు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 60లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స అధికారులు తెలిపారు.

బంగారం సీజ్ చేసి.., అరాఫత్ ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు స్మగ్లింగ్ కూలిగా పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. దుబాయ్, మలేషియా, దక్షిణాఫ్రికా ఇతర ప్రాంతాల నుంచి బంగారం తీసుకొచ్చి అక్రమ మార్గంలో కూలిల ద్వారా దేశంలోకి తరలిస్తున్నారు. ఇక్కడ చిల్లరగా అమ్మేసి కోట్లను కూడబెడుతున్నారు. బంగారం తరలించే వారిని విజిటింగ్ వీసాలతో విదేశాలకు తీసుకెళ్లి మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచి.. బంగారం ఎలా తీసుకెళ్ళాలో శిక్షణ ఇచ్చి మరీ పంపుతున్నారు. ఈ తరహా స్మగ్లింగ్ ముఠాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్న అధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold biscuits  chennai airport  chocolates  latest news  

Other Articles