Rahul gandhi comments on narendra modi

rahul gandhi, sonia gandhi, congress party, aicc, inc, delhi, amethi, priyanka gandhi, narendra modi, prime minister, modi playing drums, modi japan tour, latest news, bjp, nda, bjp election promises

rahul ganchi criticised on modi playing drums in japan : rahul questioned modi about his party promises of corruption other issues

మోడి డప్పుకొట్టడం రాహుల్ కు నచ్చలేదు

Posted: 09/05/2014 10:21 AM IST
Rahul gandhi comments on narendra modi

ప్రధాని మన్మోహన్ సింగ్ డప్పు కొట్టడం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నచ్చలేదు. దీంతో ఆయనపై విమర్శలు మొదలు పెట్టారు. దేశంలో సమస్యలు రాజ్యమేలుతుంటే ప్రధాని మాత్రం జపాన్ లో డప్పు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్య, పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నా వాటికి పరిష్కార మార్గాలు చూపలేకపోయారని ద్వజమెత్తారు. మోడి ప్రభుత్వ వంద రోజుల పాలనపై రాహుల్ వ్యంగ్యంగా మాట్లాడారు. అవినీతి నిర్మూలన, ధరల తగ్గింపు సహా ప్రజలకిచ్చిన ఇతర హామిలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

సొంత నియోజకవర్గం అమేథిలో రాహుల్ పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికంగా ఉన్న విద్యుత్ సమస్యను ప్రజలు ఆయనకు వివరించారు. గంటల కొద్ది కోతలున్నాయని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రాహుల్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. సమర్ధ ప్రభుత్వంగా చెప్పుకునే ఎన్డీయే కనీసం సరిగా కరెంటు ఇవ్వలేకపోతుందని ఎద్దేవా చేశారు. మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన  కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు సమయం దొరికినప్పుడల్లా తమ అక్కసు వెల్లగక్కుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  narendra modi  drums  latest news  

Other Articles