Arvind kejriwal releases video against bjp leaders

aap, aam aadmi party, delhi, delhi government, arvind kejriwal, anna hazare, india against corruption, corruption, delhi bjp, bjp, bjp video, aap leaders, narendra modi, latest news, president rule, elections, nazeeb jung, latest news

aap conviner arvind kejriwal releases video of bjp leaders trying to buy aap leaders in delhi : bjp facing critissm with aap video showing bjp leader trying to buy aap mlas

చూడండి : బీజేపిని ఇరుకున పెట్టిన వీడియో

Posted: 09/09/2014 10:11 AM IST
Arvind kejriwal releases video against bjp leaders

సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హవా కొనసాగించి ప్రభుత్వంలోకూర్చున్న భారతీయ జనతా పార్టికి కష్టకాలం వచ్చింది. ఒక వీడియోతో పార్టీ ఇరకాటంలో పడిపోయింది. అరవింద్ కేజ్రివాల్ విడుదల చేసిన ఆ వీడియో ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఓ బీజేపీ నేత ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్న మాటల సంబాషణల రహస్య వీడియోను అరవింద్ కేజ్రివాల్ విడుదల చేశారు. బీజేపీ నేతలు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తాం తమ పార్టీలో చేరాలని.., మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

వీడియో విడుదల చేసిన కేజ్రివాల్ బీజేపిని కడిగిపారేశారు. అవీనీతి రహిత పాలన అందిస్తామంటున్న బీజేపీ నేతలు.., ఆప్ నేతలకు గాలం వేసేందుకు ఇలా కోట్ల డబ్బులను వెదజల్లుతున్నారని విమర్శించారు. నాలుగు కోట్ల రూపాయలు, బీజేపి టికెట్ తో పాటు ఎన్నికల్లో ఓడిపోతే కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని వీడియోలో ఎమ్మెల్యేకి ఢిల్లీ బీజేపి ఉపాధ్యక్షుడు ప్రలోభపెట్టారు. ఈ వీడియో తీవ్ర విమర్శలకు దారితీయటంతో అలర్టయిన బీజేపీ నాయకత్వం.., డబ్బు ఎరచూపిన నేతకు నోటిసు పంపింది.

అయితే నోటిసు పంపినంత మాత్రాన బీజేపిపై పడిన మచ్చ పోదు. పార్టి నాయకత్వానికి తెలియకుండా నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఆ ఉపాధ్యక్షుడికి ఎందుకుంటుంది అని ఎవరికైనా తలెత్తే ప్రశ్న. అంటే దీని వెనక నాయకత్వం హస్తం ఉంది. వారి ఆదేశాల ప్రకారమే.., ఎమ్మెల్యేలను కొనే ప్రక్రియ జరుగుతోందని స్పష్టమవుతోంది. ఢిల్లీ పీఠం కోసం ఒక ఎమ్మెల్యేకు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్న కమలదళం గెలిచాక ఏ మేరకు వారితో పనులు చేయించుకుంటుందో ఊహించగలము. ఏ పార్టీ అయినా ముందు తాము., తర్వాతే ప్రజలు అనుకుంటుంది తప్ప. ప్రజలే దేవుళ్ళు అనుకుని వారి కోసమే పనిచేయదని మరోసారి స్పష్టమైంది.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi bjp  aam aadmi party  arvind kejriwal  latest news  

Other Articles