Shabbir ali on kcr

kcr, telangana, kcr family, comments on kcr, kcr comments, latest news, telangana government, latest updates, current affairs, shabbir ali, jeevan reddy, telangana assembly, loan waiver, farmers, farmers suicide, crops, agriculture

mlc shabbir ali fires on telangana chief minister kcr accuses because of kcr governence farmers suicides : kcr government is acting against farmers because of kcr farmers going for suicide says shabbir ali and jeevan reddy

కేసీఆర్ వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు

Posted: 09/26/2014 03:08 PM IST
Shabbir ali on kcr

కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. మొన్న మహిళా మంత్రి ఎందుకు లేరు అని ప్రశ్నించిన షబ్బీర్ ఇవాళ.., రైతుల ఆత్మహత్యలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. కేసీఆర్ అసమర్థత, అనుభవలేమి పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవటం వల్ల పంటలు వేయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గతంలో చేసిన అప్పుల కోసం వడ్డీ వ్యాపారులు వచ్చి ఇంటిముందే కూర్చుంటున్నారని చెప్పారు.

ఇక కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా.., రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక వ్యతిరేక విధానాలు కారణంగా ఎత్తి చూపించారు. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాష్ర్టంలో 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

కాంగ్రెస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు నివారించటానికి పలు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమి చేయటం లేదన్నారు. రుణమాఫీకి అనేక నిబంధనలు పెట్టడం.., అమలు ఆలస్యం కావటం వల్ల రైతులు అప్పుల బాధలు పడలేక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  shabbir ali  farmers  suicide  

Other Articles