Etela rajender comments on maoists

telangana, telangana government, telangana latest, telangana news, telangana chief minister, telangana cabinet, etela rajender, etela rajender caste, etela rajender profile, maoists, maoism, maoist movement, encounter, central government, government of india, latest news, ntr health university, kaloji health university, warangal

telangana minister etela rajender says their government is fallowing and ruling maoist policies : telangana government is fallowing maoist policies and we are ready for tallks with maoists says etela rajender

తెలంగాణలో మావోయిస్టు ఎజెండాలు అమలవుతున్నాయి

Posted: 09/26/2014 03:30 PM IST
Etela rajender comments on maoists

మూడున్నర కోట్ల ప్రజల కలల రాష్ర్టం తెలంగాణలో మావోయిస్టుల సిద్దాంతాలు అమలవుతున్నాయి. ఈ కష్టపడి సాధించుకున్న రాష్ర్టంలో అన్నల పాలన నడుస్తోంది. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు తెలంగాణ రాష్ర్ట ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్. స్వప్నాల రాష్ర్టంలో మావోల ఎజెండా అమలవుతోందన్నారు. అంటే బలహీన సామాజిక వర్గాల అభివృద్ధి.., వెనకబడ్డ తరగతుల కోసం ప్రత్యేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదంతా మావోల ఎజెండాలోని అంశమే కదా అని వివరణ ఇచ్చారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్.., మావోయిస్టులపై నిషేధం విధించటంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే, మావోలపై నిషేధం విధించామన్నారు. ఈ విషయంపై అంతర్గత వేదికల్లో చర్చల జరుపుతున్నామన్నారు. మావోయిస్టుల సిద్దాంతం తప్పు అనలేమని.., అయితే వారు అనుసరిస్తున్న మార్గం ఆమోదయోగ్యం కాదన్నట్లు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి మావోయిస్టుల పట్ల కాస్త సానుకూలత.., సానుభూతి చూపిస్తుంది. ఉద్యమ పార్టీ కావటంతో.., మంత్రుల్లో చాలావరకు మావోలపై సానుభూతి చూపేవారే ఉన్నారు.

ఇక వరంగల్లో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు మంచి నిర్ణయంగా తెలంగాణ ఈటెల అన్నారు. తెలంగాణకు ప్రత్యేక ఆరోగ్య విశ్వవిద్యాలయం కల త్వరలో నెరవేరుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. అయితే తమ పార్టీ మాత్రం ప్రజారోగ్యంకు పెద్దపీట వేస్తుందన్నారు. వచ్చే బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. తెలంగాణలో కరెంటు కోతలకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాంతీయ వివక్షే కారణంగా విమర్శించారు. 2017 లోగా రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తామన్నారు. అలాగే 2018 నాటికి రాష్ట్రంలో సరిపడ విద్యుత్ ఉంటుందన్నారు.

ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో తప్పుబడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. రుణ మాఫీపై అయితే కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్దాంతమన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : etela rajender  maoists  telangana  latest news  

Other Articles